Sharad Pawar : పార్టీని స్థాపించిన వారి చేతిలో నుంచి లాగేసుకున్నారు.. ఇలాంటి అన్యాయం ఎప్పుడూ చూడలేదు!

ఎన్నికల సంఘం ఎన్సీపీని స్థాపించిన వారి చేతుల్లోంచి లాక్కొని ఇతరులు ఇచ్చింది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని శరద్‌ పవార్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మా ఎన్నికల గుర్తును తీసివేయడమే కాకుండా మా పార్టీని కూడా ఇతరులకు అప్పగించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Sharad Pawar : పార్టీని స్థాపించిన వారి చేతిలో నుంచి లాగేసుకున్నారు.. ఇలాంటి అన్యాయం ఎప్పుడూ చూడలేదు!

Election Commission : కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) పై ఎన్సీపీ నేత శరద్ పవార్(Sharad Pawar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఎన్సీపీని (NCP) స్థాపించిన వారి చేతుల్లోంచి లాక్కొని ఇతరులు ఇచ్చింది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మా ఎన్నికల గుర్తును తీసివేయడమే కాకుండా మా పార్టీని కూడా ఇతరులకు అప్పగించిందని ఆయన ధ్వజమెత్తారు.

అసలు విషయం ఏమిటి?

శరద్ పవార్‌, అజిత్ పవార్(Ajith Pawar) మధ్య విభేదాల కారణంగా ఎన్సీపీలో రెండు వర్గాలు ఏర్పాటైన విషయం తెలిసిందే. దాంతో శరద్‌ పవార్‌ ఓ గ్రూపును ఏర్పాటు చేయగా, అజిత్ పవార్‌ మరో గ్రూపును ఏర్పాటు చేశారు. అయితే ఎన్సీపీ, దాని గుర్తు అజిత్ పవార్‌కు దక్కాయి. కాగా శరద్ పవార్‌కు ఎన్నికల సంఘం నుంచి కొత్త పేరు వచ్చింది. కొత్తగా ఎన్నికల సంఘం కేటాయించిన పార్టీ పేరు 'ఎన్సీపీ శరద్ చంద్ర పవార్'.

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Elections) ముందు శరద్ పవార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో అజిత్‌ పవార్ వర్గాన్నే నిజమైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం పరిగణించింది. అటువంటి పరిస్థితిలో, అజిత్ పవార్ వర్గం NCP పేరు, ఎన్నికల చిహ్నం రెండింటిపై అధికారాన్ని కలిగి ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

దీని తరువాత, శరద్ పవార్ వర్గం ఎన్నికల కమిషన్ నుండి 3 పేర్లను డిమాండ్ చేసింది. శరద్ వర్గం గుర్తు కోసం మర్రి చెట్టును డిమాండ్ చేసింది. శరద్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(Congress Party) శరద్ పవార్ పేర్లను ఎన్నికల సంఘం ముందు సమర్పించింది. అందులో ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పేరును ఎన్నికల సంఘం పేర్కొంది.

Also Read : మెడ, వెన్నెముక బాగా నొప్పి గాఉంటున్నాయా..స్పాండిలైటిస్‌ కావొచ్చు..నిర్లక్ష్యం వద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు