Heat Alert: ఏపీ ప్రజలకు అలర్ట్..నేడు ఆ మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు! వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది. By Bhavana 29 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Summer: రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుతు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే నిప్పులు కక్కుతున్నాడు. దీంతో రెండు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. అధిక వేడి వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఏపీకి ఓ హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది. మంగళవారం కూడా 61 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 159 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు. తీవ్రవడగాల్పులు వీచే మండలాలు (47):- శ్రీకాకుళం 11 , విజయనగరం 22, పార్వతీపురంమన్యం 13 , అనకాపల్లి కె.కోటపాడు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(151):- శ్రీకాకుళం15 , విజయనగరం 4, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 14, కాకినాడ 14, కోనసీమ 7, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 1, ఏలూరు 11, కృష్ణా 5, ఎన్టీఆర్ 6, గుంటూరు 6, పల్నాడు 13, బాపట్ల 1, ప్రకాశం 9, తిరుపతి 2, అనంతపురం 2, అన్నమయ్య 1, నెల్లూరు1, సత్యసాయి 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే 77 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,98 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇంట్లోనే ఉండాలని తెలిపారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. Also read: వేసవిలో హీట్ స్ట్రోక్ నుంచి కాపాడుకోవాలంటే..వీటిని తినాల్సిందే! #ap #alert #heat-waves #summer #heat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి