Telangana : గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన.. ఆరుగురు అరెస్టు

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందగా.. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్‌రెడ్డి, సైట్‌ ఇంజినీర్‌ సతీష్‌, ప్రాజెక్టు మేనేజర్‌ ఫ్రాన్సిస్‌, గుత్తేదారు రాజేశ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Telangana: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌ అరెస్ట్‌!

Hyderabad : హైదరాబాద్‌లోని బాచుపల్లిలో గోడ కూలి(Wall Collapse) ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్‌రెడ్డి, సైట్‌ ఇంజినీర్‌ సతీష్‌, ప్రాజెక్టు మేనేజర్‌ ఫ్రాన్సిస్‌, గుత్తేదారు రాజేశ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనలో మృతి చెందిన ఏడుగురి మృతదేహాలకు శవపరీక్ష పూర్తి చేశాక వారి బంధువులకు అప్పగించారు.

Also Read: గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ కూతురు

బాచుపల్లిలోని కౌసల్యకాలనీలో ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణంలో ఉంది. అయితే మంగళవారం రాత్రి వర్షం పడగా.. ప్రహరీ గోడ కూలి దానికి ఆనుకొని ఉన్న రేకులషెడ్డుపై పడింది. దీంతో అందులో ఉంటున్న ఏడుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌ను రైజ్ డెవలపర్స్‌ కన్‌స్ట్రక్షన్స్(Rize Developers Constructions) అనే కంపెనీ నిర్మిస్తోంది. గతంలో ఇక్కడ 10-15 అడుగుల ఎత్తు వరకు ఓ ప్రహారీని నిర్మించారు. ఆ తర్వాత దీన్నే 30 - 40 అడుగులకు పెంచారు. మంగళవారం కురిసిన వర్షానికి పునాదులు బలహీనపడ్డాయి. చివరికి ఆ ప్రహారీ కూలిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

Also Read: నవనీత్‌కు కౌంటరిచ్చిన అసదుద్దీన్ ఓవైసీ

Advertisment
Advertisment
తాజా కథనాలు