Texas: వ్యభిచారం అభియోగాలతో ఐదుగురు తెలుగు వారితో సహ..ఏడుగురు భారతీయులు అరెస్ట్! ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారత సంతతికి చెందిన ఏడుగురిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఐదుగురు తెలుగు వారు కూడా ఉన్నారు. వీరందరిని అమెరికా పోలీసులు వ్యభిచారం అభియోగాలతో అరెస్ట్ చేసినట్లు సమాచారం. By Bhavana 22 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Texas: భారతీయ యువకులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి వ్యభిచార కార్యకలాపాల్లో అరెస్టు కావడం ప్రస్తుతంసంచలనంగా మారింది. స్థానిక చట్టాల గురించి తెలియక వారు చేసిన పనుల వల్ల వారు కటకటాల పాలయ్యారు. ఆగస్టు 22న టెక్సాస్ లో తెల్లవారుజామున జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్ లో 18 మందిని అదుపులోనికి తీసుకోగా వారిలో ఐదుగురు తెలుగు వారుంటే..మొత్తం ఏడుగురు భారతీయ సంతతికి చెందిన వారున్నారు. **PRESS RELEASE** pic.twitter.com/LnYMYNoktZ — Denton Co Sheriff (@DentonCoSheriff) August 19, 2024 డెంటన్‌కు చెందిన ఐదుగురు తెలుగు యువకులతో సహా ఏడుగురు భారతీయులను వ్యభిచార కార్యకలాపాలపై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.డెంటన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం నిర్వహించిన వ్యభిచార కార్యకలాపాల నిరోధక స్టింగ్ ఆపరేషన్‌లో ఐదుగురు తెలుగు మూలాలు ఉన్న వ్యక్తులతో సహా ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు మైనర్ కూడా ఉన్నారు. అరెస్టైన వారిలో టెక్సాస్‌లోని డెంటాన్‌కు చెందిన బండి నిఖిల్, గల్లా మోనిష్, లిటిల్ ఎమ్‌కు చెందిన అమిత్ కుమార్, డెంటాన్‌కు చెందిన కుమ్మరి నిఖిల్, జైకిరణ్ రెడ్డి, రాయపాటి కార్తీక్, శ్రేష్టనబీన్ ఉన్నారు. Also Read: పార్టీ జెండాను ఆవిష్కరించిన తమిళ నటుడు విజయ్! #telugu-people #america #texas #indians #prostitusion మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి