Sensex Trend: సెన్సెక్స్ జోరు.. స్టాక్ మార్కెట్ రికార్డుల హోరు.. ఈ ర్యాలీ ఎందుకు?

నిన్న (డిసెంబర్ 27) స్టాక్ మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించింది. సెన్సెక్స్ 701 పాయింట్లు పెరిగింది. 72,038 వద్ద ముగిసింది. నిఫ్టీ 213 పాయింట్ల లాభంతో 21,654 వద్ద మార్కెట్ ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 లాభపడగా 3 మాత్రమే పతనమయ్యాయి.

New Update
Sensex Trend: సెన్సెక్స్ జోరు.. స్టాక్ మార్కెట్ రికార్డుల హోరు.. ఈ ర్యాలీ ఎందుకు?

Sensex Trend: ఎప్పటికప్పుడు మారుతూ ఉండే స్టాక్ మార్కెట్ ఒక్కోసారి ఊహించని లాభాలను అందిస్తూ ఉంటుంది. అంతలోనే తీరని నష్టాలనూ తీసుకువస్తుంది. ఈ అస్థిరతల మధ్య స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.  అందుకే, ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను(Sensex Trend) ప్రతిరోజూ అంచనా వేసుకుంటూ ఉండాలి. నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉండాలి. ఎంత నిపుణుల సలహాలు తీసుకున్నా.. కొంత రీసెర్చ్ కూడా అవసరమే. ప్రతిరోజూ మార్కెట్ మొదలయ్యే ముందు నిన్నటి రోజున మార్కెట్ తీరుతెన్నులపై ఒక రివ్యూ చేసుకోవడం అవసరం. అందుకే అంచనాలకు అందకుండా కదిలే స్టాక్ మార్కెట్ నిన్న మార్కెట్ ముగిసే సరికి ఎలా ఉందొ.. టాప్ గెయినర్స్ ఎవరో.. టాప్ లూజర్స్ ఎవరో మీకోసం అందిస్తోంది RTV. ఈరోజు స్టాక్ మార్కెట్ ప్రారంభ సమయంలో ఈ విషయాలని ఒకసారి పరిశీలించడం స్టాక్ ఇన్వెస్టర్స్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిన్నటి అంటే మంగళవారంనాటి స్టాక్ మార్కెట్ కదలికలపై ఓ లుక్కేద్దాం.  

నిన్న (డిసెంబర్ 27) స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులు నెలకొల్పింది. స్టాక్ మార్కెట్‌ బుధవారం (డిసెంబర్ 27) సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. నిన్న ట్రేడింగ్‌ సమయంలో  సెన్సెక్స్ 72,119 స్థాయిని, నిఫ్టీ 21,675 స్థాయిని తాకాయి. అయితే దీని తర్వాత స్వల్ప క్షీణతతో నిఫ్టీ 213 పాయింట్ల లాభంతో 21,654 వద్ద మార్కెట్ ముగిసింది. అదే సమయంలో, సెన్సెక్స్(Sensex Trend) 701 పాయింట్లు పెరిగింది. 72,038 వద్ద ముగిసింది. బుధవారం సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 లాభపడగా 3 మాత్రమే పతనమయ్యాయి.

ప్రపంచ మార్కెట్లలో ఉన్న సానుకూల పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు కదం తొక్కాయి. సరికొత్త గరిష్టాల వైపు స్నెస్క్స్ దూసుకుపోయింది. బ్యాంకింగ్, కమోడిటీ, మెటల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ తొలిసారిగా 72,000 మార్క్ టచ్ చేసింది. మరోవైపు నిఫ్టీ కూడా 21,650 స్థాయిని దాటిపోయింది. 

Also Read: పైకెగసిన స్టాక్ మార్కెట్.. ఈ స్టాక్స్ దుమ్ములేపాయి 

Sensex Trend:లాభాల సేకరణలో ఆయిల్‌ అండ్‌గ్యాస్, యుటిలిటీ, విద్యుత్, సేవా రంగ షేర్లు ముందున్నాయి. ఇక ఫారిన్ ఇన్వెస్టర్స్ రూ.2,926 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.192 కోట్ల షేర్లను విక్రయించారు. 

స్టాక్ మార్కెట్లో ఈ ర్యాలీ పై నిపుణులు ఏమంటున్నారంటే.. 

Sensex Trend:ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ మార్చి 2024 కంటే ముందుగానే వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలత కనిపిస్తోంది. ఈ పరిస్థితి దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊపు తీసుకువచ్చింది. మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది.  అది శాంటా క్లాజ్ ర్యాలీ. అంటే, డిసెంబర్ చివరి 5 ట్రేడింగ్ సెషన్స్, జనవరి తొలి 2 ట్రేడింగ్ సెషన్స్. గత 20 ఏళ్లలో ఈ సెషన్స్ లో మార్కెట్ ర్యాలీ కొనసాగుతూనే ఉంటోంది. అదే ధోరణి ఇప్పుడు కూడా ఉందనేది నిపుణుల మాట. 

వాల్‌ స్ట్రీట్‌లో ‘సెల్‌ చైనా, బై భారత్‌’ వ్యూహం జోరుగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా డిసెంబర్‌లో ఎఫ్‌ఐఐలు రూ.57,275 కోట్ల ఈక్విటీలను కొన్నారు. రెండో త్రైమాసికంలో అలాగే భారత కరెంట్‌ ఖాతా లోటు తగ్గడం కలిసొచ్చింది. భారీ భద్రత నడుమ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకల పునఃప్రారంభంతో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 80 డాలర్ల దిగువకు చేరుకుంది.

stock market 27.12.2023 Stock Market Closing 27.12.2023

లాభాలు తీసుకున్నవి ఇవే.. 

Sensex Trend:హిందాల్కో 4%, జేఎస్‌డబ్ల్యూ 3%, సెయిల్, నాల్కో 2% అలాగే టాటా స్టీల్, వెల్‌స్పాన్‌ కార్ప్, హిందుస్థాన్‌ కాపర్, వేదాంతా, జిందాల్‌ స్టీల్‌ షేర్లు 1% వరకు లాభాలను సాధించాయి. 

ఈ మధ్యకాలంలో వెనక్కి తగ్గినట్టు కనిపించిన బ్యాంకింగ్ షేర్లు బుధవారం లాభాల బాటలో పడ్డాయి. పీఎన్‌బీ 4%, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3%, ఎస్‌బీఐ 2%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.50%, బంధన్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ, కోటక్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, ఏయూస్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌లు 1–6% లు పైకి ఎగిశాయి. 

Sensex Trend: మొత్తమ్మీద చూసుకుంటే, దేశీయ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్స్ సంపద బాగా పెరిగింది. గత నాలుగు సెషన్స్ లో సెన్సెక్స్ 1,532 పాయింట్ల ర్యాలీ తీసుకుంది. దీంతో దాదాపు 11.11 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టి జరిగింది. ఇక బీఎస్ఈలో లిస్ట్ అయి వున్న మొత్తం కంపెనీల విలువ కూడా జీవితకాల గరిష్ట స్థాయి రూ.361 లక్షల కోట్లకు చేరుకుంది. 

Advertisment