Amarnath Yatra : అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర కుట్ర..హైవేపే ఐఈడీ స్వాధీనం..!!

జూలై 1 నుంచి జరుగుతున్న అమర్ నాథ్ యాత్ర ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతోంది. భక్తులు తగ్గిన దృష్ట్యా ఆగస్టు 23 నుంచి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ యాత్ర ఆగస్టు 31న ముగియాల్సి ఉంది. అమర్ నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదుల కుట్రను భద్రతాదళాల ఛేదించాయి. జమ్మూలోని హైవేపై ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు.

New Update
Amarnath Yatra : అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర కుట్ర..హైవేపే ఐఈడీ స్వాధీనం..!!

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను భద్రతాదబలగాలు భగ్నం చేశాయి. జమ్మూలోని నగ్రోటాలోని హైవేపై సోమవారం రాత్రి 12.30 గంటలకు భద్రతా బలగాలు ఐఈడీని స్వాధీనం చేసుకున్నాయి. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఐఈడీని కనిపెట్టడంలో మరో మూడు గంటలు ఆలస్యం జరిగి ఉంటే జమ్మూలో పెను ఉగ్రవాద ఘటన జరిగి ఉండేది. అదే సమయంలో, IED (improvised explosive device) రికవరీ తర్వాత, మొత్తం హైవేపై ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

జమ్మూలోని భగవతి నగర్‌లో ఉన్న యాత్రి నివాస్ నుండి ఉదయం 3.30 గంటలకు అమర్‌నాథ్ యాత్రా (Amarnath Yatra) బృందం కాశ్మీర్‌కు (kashmir) బయలుదేరింది . దీనికి ముందు జమ్మూ-శ్రీనగర్ హైవేపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భద్రతా బలగాలు నగ్రోటా సమీపంలోని హైవేపై కూంబింగ్ చేపట్టాయి. ఇంతలో భద్రతా బలగాలకు అనుమానాస్పద వస్తువు కనిపించింది. దీంతో హైవేపై ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేసి.. ఆధునిక పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దీంతో అనుమానాస్పద ఐఈడీని గుర్తించారు. అనంతరం పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంతకాలం క్రితమే అక్కడ ఐఈడీ అమర్చినట్లు అనుమానిస్తున్నారు.

ఈ IED రికవరీ చేసుకున్న తర్వాత, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతను మరింత పెంచారు . పలుచోట్ల బ్లాక్‌లు ఏర్పాటు చేసి జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ జమ్మూ ఎస్‌ఎస్పీ చందన్ కోహ్లి మాట్లాడుతూ నగ్రోటా హైవేపై అనుమానాస్పద ఐఇడి దొరికిందని తెలిపారు. ఘటనా స్థలానికి నిపుణుల బృందాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు. విచారణ తర్వాతే దీనిపై మరిన్ని విషయాలు చెప్పుతామని వెల్లడించారు.

Also Read: బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు