తండ్రిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకులు.. 30 ఏళ్ల తర్వాత ఎలా బయటపడిందంటే?

30 ఏళ్ల క్రితం తండ్రిని ఇద్దరు కొడుకులు కలిసి దారుణంగా చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోదరుల మీద అనుమానం వచ్చిన మూడో కొడుకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

New Update
 Gujarat Accident

యూపీలో కన్నతండ్రిని చంపి ఇంటి ఆవరణలోనే పాతిపెట్టిన దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో 30 ఏళ్ల క్రితం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని హాథ్రస్‌కు చెందిన బుధ సింగ్ 1994లో మిస్ అయ్యాడు. అయితే వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే ఇతనికి నలుగురు కుమారులు ఉన్నారు. ఇటీవల కుమారుల మధ్య గొడవలు వచ్చాయి. ఈ క్రమంలో మూడో కుమారుడు పంజాబీ సింగ్‌కి 30 ఏళ్ల క్రితం తండ్రికి, అన్నయ్యలకు మధ్య జరిగిన గొడవ గుర్తుకు వచ్చింది.

ఇదే విషయాన్ని సోదరులతో మాట్లాడటంతో ఇద్దరూ అతన్ని బెదిరించారు. అనుమానం వచ్చి పంజాబీ సింగ్ స్థానికంగా ఉన్న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తన తండ్రిని చంపిది సోదరులే అని, శవాన్ని ఇంటి ఆవరణంలో పాతిపెట్టారని పంజాబీ సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు బుధ సింగ్ ఇంట్లో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో పోలీసులకు ఓ అస్థిపంజరం దొరికడంతో పోస్టుమార్టం చేసి వెంటనే డీఎన్‌ఏ పరీక్షకు పంపించారన్నారు. డీఎన్‌‌ఏ రిపోర్ట్ బట్టి సోదరులపై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read :  హైడ్రా హైడ్రొజన్ బాంబులా మారింది: హరీష్ రావు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weight Lose: ఇలా చేశారంటే వేసవిలో సులభంగా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చు. 

New Update

Weight Lose: సరైన ఆహారం తీసుకుంటే వేసవిలో బరువు తగ్గడం శీతాకాలంలో కంటే సులభం అవుతుంది. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే సలాడ్లు, ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ చేర్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. శీతాకాలంలో బరువు తరచుగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మనం అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటాం. అయితే బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

కాలేయం ఆరోగ్యంగా..

వేసవిలో పుచ్చకాయ సులభంగా దొరుకుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప పండు. ఇందులో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి, లైకోపీన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సలాడ్ ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా వంటి తక్కువ కేలరీల ఆహారాలు సులభంగా లభిస్తాయి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి: శరీరంలోని అధిక నీటిశాతం తగ్గించే చిట్కాలు

కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది.  సలాడ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని పుదీనా, నిమ్మకాయ, బెర్రీలతో కలిపి తాగవచ్చు. ఈ పానీయం జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చంటున్నారు నిపుణులు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఒక గొప్ప ఎంపిక. ఇది శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచే ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని ఎందుకు చెబుతారు?

(weight-lose | weight-lose-exercises | vegetable-juices-for-weight-lose | latest-news | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips)

 

Advertisment
Advertisment
Advertisment