Indian Railways: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..

దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ కొత్తగా మరో తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. ట్రైన్స్ వివరాల కోసం పైన హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Railway Jobs: రైల్వేలో 9,144 ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల

Special Trains for Dussehra: దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ(Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ కొత్తగా మరో తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ప్రకటన ప్రకారం..

ప్రత్యేక రైళ్ల వివరాలు..

🚊 రైలు నంబర్ 07041 (సికింద్రాబాద్-తిరుపతి) అక్టోబర్ 19న సికింద్రాబాద్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

🚊 రైలు నెం 07042 (తిరుపతి-సికింద్రాబాద్) అక్టోబర్ 20వ తేదీన తిరుపతిలో రాత్రి 7:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

🚊 ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయచూర్, మంత్రాలయం రోడ్ (రైలు నెం. 07042 మాత్రమే), గుంతకల్, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతాయి.

🚊 రైలు నెం 07065 (సికింద్రాబాద్ - కాకినాడ టౌన్) అక్టోబర్ 23వ తేదీన సికింద్రాబాద్ నుండి రాత్రి 7 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది.

ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..

🚊 రైలు నంబర్ 07066 (కాకినాడ టౌన్-సికింద్రాబాద్) అక్టోబర్ 24న కాకినాడ టౌన్ నుండి రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

🚊 ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి.

🚊 రైలు నెం 07489 (సికింద్రాబాద్-తిరుపతి) అక్టోబర్ 21న సికింద్రాబాద్ నుండి రాత్రి 10:50 గంటలకు బయలుదేరి ఉదయం 9:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

🚊 రైలు నెం 07490 (తిరుపతి-సికింద్రాబాద్) అక్టోబర్ 22న తిరుపతిలో సాయంత్రం 4:35 గంటలకు బయలుదేరి ఉదయం 4:50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

🚊 ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి.

🚊 రైలు నెం -07653 (కాచిగూడ-కాకినాడ టౌన్) కాచిగూడ నుండి రాత్రి 9:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన ప్రయాణ తేదీ అక్టోబర్ 19, 26.

🚊 రైలు నెం 07654 (కాకినాడ టౌన్ - కాచిగూడ) కాకినాడ టౌన్ నుండి సాయంత్రం 5:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ప్రయాణ తేదీ అక్టోబర్ 20, 29.

🚊 ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి.

కొన్ని రైళ్ల పునరుద్ధరణ

గతంలో రద్దు చేసిన కొన్ని రైళ్లను పునరుద్ధరించింది దక్షిణ మధ్య రైల్వే (SCR). రైలు నెం - 12806 (లింగంపల్లి-విశాఖపట్నం), గత నెల రద్దు చేయబడం జరిగింది. దీనిని అక్టోబర్ 18 నుండి అది పునరుద్ధరించడం జరిగింది. రైలు నెం - 128065 (విశాఖపట్నం- లింగంపల్లి) ఇది అక్టోబర్ 17 నుండి పునరుద్ధరించడం జరిగింది.

ఇదికూడా చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు