Supreme Court: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో అలా చేయడం కష్టమే: సుప్రీంకోర్టు పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును సాధారణ ఎన్నికల్లోపే అమలు చేయాలని ఇటీవల ఓ కాంగ్రెస్ నాయకురాలు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. అయితే దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జనగణనకు ముందే దీన్ని అమలుచేయడం కష్టమని పేర్కొంది. By B Aravind 04 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మహిళల రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. లోక్‌సభ, అసెంబ్లీలో మూడోవంతు స్థానాలను మహిళలకు రిజర్వు చేస్తూ బీజేపీ సర్కార్ ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) తర్వాతే ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. చట్టసభల్లో 15 ఏళ్ల వరకు మహిళకు లోక్‌సభ, అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. ఇక డిలిమిటేషన్ తర్వాత రొటేషన్ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఇవ్వడం జరుగుతుంది. Also read: భారీ భూకంపం.. 128కి చేరిన మృతుల సంఖ్య Also Read: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. అందరికీ కార్లు.. ఆఫీస్ బాయ్‌కి కూడా! వాస్తవానికి డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలంటే జనగణన జరగాల్సి ఉంటుంది. అయితే 2021లోనే జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది. అయితే ఈ బిల్లును ఇప్పుడే అమలు చేయాలని కాంగ్రెస్‌తో సహా పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో తెచ్చిన ఈ మహిళా బిల్లును రానున్న సాధారణ ఎన్నికల్లోపే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో జనగణన అనంతరం అమల్లోకి వస్తున్న అని చెబుతున్న భాగాన్ని కొట్టేయడం చాలా కష్టమని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చేందుకు తిరస్కరించింది. #telugu-news #supreme-court #women-reservation-bill మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి