SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్..డెబిట్ కార్డ్‌లపై మోత భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్యింగ్ వ్యవస్థ అయిన ఎస్‌బీఐ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. By Manogna alamuru 27 Mar 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Debit Cards Annual Fee: దేశంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటి ఎస్‌బీఐ. దేశీ కంపెనీ అయిన ఈ బ్యాంక్‌కు చాలా మంది కస్టమర్లు ఉంటారు. వీరి కోసం ఇది రకరకాల డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సేవలను అందిస్తోంది. అయితే వాటికి అనుగుణంగా కొ్త ఛార్జీలను కూడా వసూలు చేస్తుంది. ఇందులో క్లిసిక్, సిల్వర్, గ్లోబల్, ఆ్టాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ ఇలా రకరకాలుఉన్నాయి. వీటికి ఇప్పటి వరకు ఏడాది 125రూ నిర్వహణ చార్జీ కింద వసూలు చేస్తోంది ఎస్‌బీఐ. ఇప్పుడు ఈ ఛార్జీలనే పెంచేసింది. పెంచిన రేట్ల ప్రకారం ఇక మీదట డెబిట్ కార్డ్ నిర్వహణకు ఏడాదికి 200రూ...దాంతో పాటూ జీఎస్టీ ఛార్జీలను కూడా పే చేయాలి. ఇది వచ్చే నెల అంటే ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇక మిగతా కార్డులు అయిన యువ అండ్ అదర్ కార్డ్స్- యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ లపై యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు ప్రస్తుతం రూ. 175 + జీఎస్టీగా ఉండగా.. దీనిని దాదాపు 50 శాతం వరకు పెంచి రూ. 250 + GST గా నిర్ణయించింది. మరోవైపు ఎస్‌బీఐ ప్లాటినమ్ డెబిట్ కార్డ్స్ మీద ప్రస్తుతం ఉనన 250 రూలను 325రూ ప్లస్ జీఎస్టీగా నిర్ణయించింది. ఎస్‌బీఐ ప్రైడ్ ప్రీమియమ్ బిజినెస్ డెబిట్ కార్డుల మీద ఉన్న ప్రీమియం కార్డుల ఛార్జీల్ని రూ. 350 ప్లస్ జీఎస్టీ నుంచి రూ. 425 ప్లస్ జీఎస్టీగా చేసింది. ఈ పెంపుతో కస్టమర్ల మీద మరింత భారం పడనుంది. వర్చువల్ కార్డ్... ఇక గత కొన్ని నెలలుగా ఎస్‌బీఐ వర్చువల్ డెబిట్ కార్డు సేవల్ని కూడా అందిస్తోంది. ఈ ఎస్‌బీఐ వర్చువల్ కార్డునే ఎలక్ట్రానిక్ కార్డు లేదా ఇ- కార్డ్ అని పిలుస్తారు. ఇ- కామర్స్ ట్రాన్సాక్షన్ల కోసం మాత్రమే ఈ కార్డు సేవలు వినియోగించుకోవచ్చు. దీనిని పొందాలంటే యోనో యాస్‌లోకి వెళ్ళి మై డెబిట్ కార్డ్ సెక్షన్‌లో కొత్త కార్డ్ అప్లై చేసుకోవాలి. తరువాత ఓటీపీ ఎంటర్ చేసి వర్చువల్ బెడిట్ కార్డ్‌ను యాక్టివేట్ చేయాలి. అప్పుడు కార్డ్ జనరేట్ అవుతుంది. ఫిజికల్ కార్డ్ అక్కర్లేకుండా వీటితో ట్రాన్సాక్షన్స్ చేయవచ్చును. ఫ్రాడ్ జరగకుండా ఉండేలా ఇవి సహాయపడతాయి. మొదట్లో దీని మీద ఎటువంటి ఫీజులు లేవు. కానీ ఇప్పుడు వీటికి యాన్యువల్ ఫీజును వసూలు చేస్తోంది ఎస్‌బీఐ. Also Read:BRS MLC Kavitha: కవితకు ఖైదీ నంబర్ 666..డల్‌గా మొదటిరోజు #bank #sbi #debit-cards #annual-fee మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి