Uttar Pradesh: హత్రాస్‌ తొక్కిసలాట ఘటనలో పురోగతి.. ఆరుగురు అరెస్టు

యూపీలోని హత్రాస్‌ జిల్లాలో భోలే బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్‌ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు యూపీ పోలీసులు గురువారం వెల్లడించారు.

New Update
Uttar Pradesh: హత్రాస్‌ తొక్కిసలాట ఘటనలో పురోగతి.. ఆరుగురు అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో భోలే బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు యూపీ పోలీసులు గురువారం వెల్లడించారు. వీళ్లలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని.. వీళ్లంతా సత్సంగ్‌ను నిర్వహించే ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులని పేర్కొన్నారు. ఈ కమిటీలో వాళ్లు సేవదార్లుగా పనిచేశారని తెలిపారు. ఇక ఎఫ్‌ఐఆర్‌లో ముఖ్య సేవదార్‌ దేవ్‌ ప్రకాష్‌ మధుకర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారమని ఇన్‌స్పెక్టర్ జనరల్ శలభ్ మాథుర్ తెలిపారు. అలాగే మధుకర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని పేర్కొన్నారు.

Also read: ఝార్ఖండ్​ సీఎంగా హేమంత్​ సోరెన్​ ప్రమాణ స్వీకారం..

ప్రస్తుతం దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. విచారణలో భోలో బాబా పాత్ర ఉన్నట్లు తేలితే ఆయనపై కూడా చర్యలు తీసుకొని అరెస్టు చేస్తామని తెలిపారు. అవసరమైతే అధికారులు కూడా భోలే బాబాను ప్రశ్నించవచ్చని సూచించారు. ఆయన పేరు మాత్రం ఇంకా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదని.. కానీ విచారణకు పర్మిషన్ ఉందని చెప్పారు. ఇప్పటికే భోలే బాబాపా నేరారోపణలు ఉన్న నగరాలకు పోలీసు బృందాలను పంపించారు.

పోలీసులు ఫైల్‌ చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. హత్రస్‌లో ఈ సత్సంగ్ కార్యక్రమానికి 80 వేల మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కానీ 2.50 లక్షల మందికి పైగా జనాలు ఆ మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. వేలాది మంది అనుచరులు ఆశ్వీర్వాదం కోసం.. భోలే బాబా పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించడానికి ఒక్కసారిగా వెళ్లారు. వాళ్లని భోలే బాబా భద్రతా సిబ్బంది వెనక్కి నెట్టారు. దీంతో చాలామంది కిందపడిపోయారు. చివరికి ఇది తొక్కిసలాటకు దారితీసింది. అయితే తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన అనంతరం భోలే బాబా స్పందించారు. తాను వెళ్లిపోయిన చాలాసేపటికీ తొక్కిసలాట జరిగిందని.. ఈ దుర్ఘటన వెనుక వ్యతిరేక శక్తులున్నాయని ప్రకటించారు. మరోవైపు భోలే బాబాపై కూడా తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూఢభక్తితో ప్రజలు ఇలాంటి బాబాలను నమ్మడాన్ని కూడా నెటీజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Also Read: ఉగ్రవాద దేశాలను ఏకాకిని చేయాలి..ప్రధాని మోదీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు