Samantha : RCB - SRH ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సమంత.. నెట్టింట వైరల్ గా మారిన పోస్ట్? By Anil Kumar 22 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Samantha Latest Insta Post : టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియా (Social Media) ద్వారా నిత్యం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో సందడి చేసే సామ్.. తాజాగా తన ఇన్ స్టా లో పెట్టిన పోస్ట్ SRH - RCB ఫ్యాన్స్ మధ్య చిక్కుక పెట్టింది. ప్రెజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2024 (IPL 2024) లీగ్ లో మంగళవారం నుంచి ప్లే ఆఫ్ మ్యాచులు స్టార్ అయ్యాయి. క్యాలిఫయిర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించి ఫైనల్‌కి చేరుకుంది. హైదరాబాద్ ఫైనల్ కి వెళ్లాలంటే క్వాలిఫయిర్ 2 తప్పక గెలవాల్సి ఉంటుంది. Also Read : ‘దేవర’ లో ఛాన్స్ రావడం నా అదృష్టం.. సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందంటే : జాన్వీ కపూర్ దీని కంటే ముందు నేడు(మే 22) రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ ఫైనల్ బెర్త్ కోసం హైదరాబాద్ తో పోటీ పడాల్సి ఉంటుంది. ఇలాంటి తరణంలో సమంత తన ఇన్ స్టా లో ఓ పోస్ట్ పెట్టింది. 'మీరు విజయం సాధిస్తే చూడాలని ఉంది' సమంత తన ఇన్ స్టా పోస్ట్ లో.. " 'మీరు విజయం సాధిస్తే చూడాలని ఉంది' అంటూ పోస్ట్ పెట్టింది. 'మీ హృదయం ఏది కోరుకున్నా, మీరు ఎలాంటి ఆకాంక్షలు కలిగి ఉన్నా, నేను మీ కోసం మద్దతు ఇస్తాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ ఆ పోస్ట్ కింద రాసుకొచ్చింది. దీంతో సామ్ RCB టీమ్ ని సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్స్ అంటున్నారు. మరికొందరేమో హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో RCB - SRH ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలయింది. సమంత మాకంటే మాకు సపోర్ట్ చేస్తుందని ఇరు టీమ్స్ కి చెందిన ఫ్యాన్స్ ఆ పోస్ట్ ని నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇంతకీ సమంత ఎవరకి సపోర్ట్ చేస్తూ ఆ పోస్ట్ పెట్టింది? అనేది తెలియాలంటే దీనిపై ఆమెనే స్వయంగా క్లారిటీ ఇవ్వాలి. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) #samantha #rcb #srh #post-viral మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి