Sachin B'day Special : అతడో మతం..దేవుడు..ఎంతమంది ఉన్నా తరాలు ఆదర్శంగా తీసుకునే క్రికెటర్ సచిన్ భారత్‌లో క్రికెట్ ఓ మతమైతే.. సచిన్ టెండుల్కర్ దేవుడు.. ఈ ఒక్క మాట చాలు భారతీయుల మనసులో సచిన్‌కు ఉన్న స్థానమేంటో అర్థం చేసుకోవడానికి. చాలా మంది క్రికెట్ జీవితం సచిన్ ఆటతోనే మొదలైంది.. సచిన్ రిటైర్‌మెంట్‌తో ముగిసింది. By Manogna alamuru 24 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Master Blaster Sachin Tendulkar : 2011 ప్రపంచకప్ ఫైనల్(2011 World Cup Final) గుర్తుంది కదా.. మర్చిపోయే విషయమా అది.. యావత్ దేశం ఆనందంతో, గర్వంతో ఉప్పొంగిన ఆ క్షణాలు సగటు క్రికెట్ అభిమాని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు. సచిన్, సెహ్వాగ్ త్వరగా ఔట్ అవ్వడం.. తర్వాత కోహ్లీ, గంభీర్ కీలక భాగస్వామ్యం.. ఇక ధనాధన్ ధోనీ వీరవిహారం ఇది ఫైనల్‌లో ఇండియా గెలిచిన తీరు. అయితే నాడు యువరాజ్ కంటే ముందుగా ధోనీ బ్యాటింగ్‌కు రావడం అందరికి ఆశ్చర్యపరిచింది. ఫైనల్ ముందు వరకు అసలు ఫామ్‌లోనే లేని ధోనీ.. టోర్నమెంట్‌లోనే బెస్ట్ ప్లేయర్‌గా ఉన్న యువరాజ్ కంటే ముందుకు రావడం వర్కౌట్ అవుతుందని ముందుగా ఎవరూ ఊహించలేదు. ఈ ఐడియా వెనుక ధోనీ బ్రెయిన్ ఉందని అంతా అనుకుంటారు కానీ.. అసలు ధోనీని ముందుగా వెళ్లాలని చెప్పింది సచిన్! కోహ్లీ(Virat Kohli) రైట్ హ్యాండర్, గంభీర్ లెఫ్ట్ హ్యాండర్.. సచిన్, సెహ్వాగ్ వికెట్ల తర్వాత ఈ ఇద్దరు జట్టును గాడిలో పెట్టే బాధ్యతను తీసుకున్నారు. అయితే ఇద్దరిలో ఒకరు ఔటైన తర్వాత నిజానికి అయితే యువరాజ్ బ్యాటింగ్‌కు రావాలి. అయితే సచిన్ మాత్రం ప్లాన్ మార్చాడు. కోహ్లీ ఔటైతే ధోనీ బ్యాటింగ్‌కు దిగాలని.. గంభీర్ ఔటైతే యువరాజ్ వెళ్లాలని చెప్పాడు. ఎందుకంటే ఓ రైట్ హ్యాండర్ ఔటైతే మరో రైట్ హ్యాండరే వెళ్లాలని.. అప్పుడు లెఫ్ట్-రైట్ కాంబో దెబ్బతినకుండా ఉంటుందన్నది సచిన్ ఆలోచన. ఈ ప్రణాళికే వర్కౌట్ అయ్యింది. ఇండియా వరల్డ్ కప్ గెలవడానికి కారణమైంది. టోర్నీలో భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన సచిన్.. ఫైనల్‌లో 18 పరుగులకే ఔటైనా తన పదునైన ప్లాన్‌తో ఇండియా ఫైనల్ గెలిచేందుకు కారణమయ్యాడు. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) క్రికెట్ పిచ్ పై భయంకరమైన ఫామ్‌లో ఉన్నప్పుడల్లా, అతడి బాటింగ్ చూసి ప్రత్యర్థులు కూడా ప్రేక్షకులు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. సచిన్ ఆడినంత సేపు.. తర్వాత ఆడి వెళ్ళిపోతున్నప్పుడూ.. అతడిని ప్రత్యర్థులు అభినందించడం అప్పట్లో కామన్ గా కనిపించేది.. ఇప్పడంటే థార్ రోడ్డు లాంటి పిచ్ లు, పసలేని బౌలింగ్.. వేగంగా వేసినా లైన్ లో వేయాలని బౌలర్లు.. బ్యాటింగ్ కు పూర్తిగా అనూకులించే వికెట్.. కానీ 90వ దశకంలో అరవీర భయంకర బౌలర్లను సచిన్ ఫేస్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ పిచ్ పెర్త్ లో స్ట్రాంగ్ ఆస్ట్రేలియా టీమ్ పై కేవలం 18ఏళ్ల వయసులోనే సచిన్ సెంచరీ బాదాడు.. ఈ ఒక్క ఇన్నింగ్స్ చాలు.. సచిన్ ఎలాంటి ఆటగాడో చెప్పడానికి. అందుకే సచిన్‌తో నేటి తరంతో ఏ ప్లేయర్‌తో కంపేర్ చేసినా అది తప్పే అవుతుంది. సచిన్ ఆడుతున్నంతా సేపు టీవీ ఆన్ చేసే ఉంటుంది.. సచిన్ అవుట్ అవ్వగానే టీవీ సెట్లు ఆఫ్ ఐపోతాయి.. బీబీసీ దశాబ్దాల క్రితం చెప్పిన ఈ మాట అక్షరాల నిజం. క్రికెట్ ను కెరీర్ ను మార్చుకున్న ఎంతో మందికి అతను నిజంగా దేవుడే.. ధోనీ నుంచి కోహ్లీ వరకు అతను ఆరాధిస్తూ ఎదిగినవాళ్లే.. సచిన్ ను చూసి బ్యాట్ పట్టినవాళ్లే.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండే సచిన్ క్రికెట్ కే కేరాఫ్ గా మారాడు. క్రికెట్ తెలిసిన వాళ్లకి సచిన్ తెలుసు.. మూలాలను మరువని తత్వం అతని మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.. ఇప్పుడంటే రకరకాల ఛాంట్స్ స్టేడియంలో వినిపిస్తున్నాయి కానీ.. 'సచిన్.. సచిన్' మాత్రం ఓ ఎమోషన్.. స్టేడియమంతా ఒక్క తాటిపైకి వచ్చి నినాదాలు చేయడం సచిన్ తోనే మొదలైంది. క్రికెట్‌కు దూరమై పదేళ్లు దాటినా ఇప్పటికీ సచిన్‌ను చూస్తే స్టేడియం హోరెత్తిపోతుంది. తన బ్యాటింగ్ విన్యాసాలతో ఆటకే వన్నే తెచ్చిన సచిన్‌కు ఆర్టీవీ(RTV) బర్త్‌డే విషెస్ చెబుతోంది. Also Read:Viral Video: లైవ్‌లో నోరు జారిన రిపోర్టర్..వీడియో వైరల్ #cricket #sachin-tendulkar #birthday మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి