Russia-Ukrain War: మళ్లీ షురూ.. రష్యాలో డ్రోన్ దాడి చేసిన ఉక్రెయన్.. రష్యాలోని ఓ చమురు నిల్వ డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడటం కలకలం రేపింది. మొత్తం 6వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగి ఉన్న నాలుగు చమురు రిజర్వాయర్లు మంటల్లో కాలిపోయాయి. మార్చిలో రష్యాలో అధ్యక్ష ఎన్నకలు జరగనున్న వేళ మరోసారి దాడులు జరగడం కలకలం రేపింది. By B Aravind 20 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఎక్కడో ఓ చోట చిన్నచిన్నగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా రష్యాలో ఓ దాడి జరిగింది. చమురు నిల్వ డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే క్లింట్సీలో ఈ దాడి జరిగింది. మొత్తం 6వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగి ఉన్న నాలుగు చమురు రిజర్వాయర్లు మంటల్లో కాలిపోయాయి. Also Read: రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి: భట్టి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మార్చి 17న రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి పౌరులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ దాడి జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఏడాది రష్యా సరిహద్దు ప్రాంతాల్లో దాడులు తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీంపంలో రష్యాలోని బెల్గొరోడ్‌లో డ్రోన్ దాడుల ముప్పు వల్ల ఎపిఫని అనే ఉత్సవాలను రద్దు చేశారు. ఆగిన వేడుక డ్రోన్ దాడుల భయంతో రష్యాలో ఓ వేడుకను ఆపేయడం ఇదే మొదటిసారి. మాస్కోకు దక్షిణంగా 600 కిలో మీటర్ల దూరంలో ఉన్న టాంబొవ్‌లోని గన్‌పౌడర్ ప్లాంటుపై డ్రోన్ దాడి జరిగినట్లు ఉక్రెయిన్ జాతీయ మీడియా తెలిపింది. కానీ టాంబొవ్ గవర్నర్ అయిన మాగ్జిమ్ మాత్రం ఆ ప్లాంటు యథావిధిగా పనిచేస్తోందని చెప్పారు. ఇక రష్యాదాడుల్లో ఖర్కీవ్ అనే ప్రాంతంలో ఓ మహిళ మరణించగా.. ఓ మందు పాతర పేలి మరో వ్యక్తి మృతి చెందాడు. Also Read: థేమ్స్ నదిలా మూసీనది..సీఎం రేవంత్ రెడ్డి విజన్ 2050 ప్లాన్ #telugu-news #drone-attack #russia-ukraine-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి