Modi: మోదీ వల్లే యుద్ధం ఆగిందట.. రాజ్‌నాథ్‌సింగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్!

2022లో రష్యా-యుక్రెయిన్‌ యుద్ధ సమయంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మధ్యలో ఒక నాలుగు గంటలు యుద్ధం నిలిచిపోయింది. రష్యా, యుక్రెయిన్‌తో మోదీ మాట్లాడడం వల్ల అలా నిలిపివేశారని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.

New Update
Modi: మోదీ వల్లే యుద్ధం ఆగిందట.. రాజ్‌నాథ్‌సింగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్!

Russia-Ukraine War: అప్పుడెప్పుడో గుర్తు.. నాటి తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ హైదరాబాద్‌లో జరిగిన ఓ సభలో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధాన్ని మోదీ (PM Modi) ఆపగలిగారని చెప్పుకొచ్చారు. అది కాస్త బీఆర్‌ఎస్‌ని ట్రోల్‌ పీస్‌ కంటెంట్‌గా మారింది. బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ ఐటీ సెల్‌ విమర్శల వర్షం కురిపించింది. బండి సంజయ్‌ని ఎగతాళి చేస్తూ పోస్టులు పెట్టింది. అయితే తాజాగా కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(Rajnath Singh) కూడా అదే తరహా కామెంట్స్ చేశారు.

రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏం అన్నారంటే?
రష్యా(Russia)తో యుద్ధంలో యుక్రెయిన్‌(Ukraine)లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తరలించడంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు . లండన్‌లో జరిగిన పౌర రిసెప్షన్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుద్ధ సమయంలో యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల (Indian Students) తిరిగి స్వదేశానికి మోదీ ఏం చేశారో చెప్పుకొచ్చారు. రెండు దేశాల నాయకులతో ప్రధాని చర్చలు జరిపారని తెలిపారు. మోదీ దౌత్య ప్రయత్నాల ఫలితంగా నాలుగు నుంచి ఐదు గంటల పాటు యుద్ధానికి బ్రేక్‌ పడిందని ఆయన నొక్కి చెప్పారు.

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌తో (Joe Biden) మోదీ కమ్యూనికేట్ చేశారన్నారు రాజ్‌నాథ్‌సింగ్‌. మోదీ కారణంగానే నాలుగు నుంచి ఐదు గంటలపాటు యుద్ధాన్ని నిలిపివేశారన్నారు రాజ్‌నాథ్‌. మోదీ దౌత్యం యుక్రెయిన్ నుంచి 22వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులను సురక్షితంగా తరలించడానికి వీలు కల్పించిందన్నారు. యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా కింద మొత్తం 80 విమానాలను నడిపింది . నిర్వాసితులు భూమి మార్గాల ద్వారా రొమేనియా, హంగేరి, పోలాండ్, స్లోవేకియా లాంటి పొరుగు దేశాలకు ముందుగా పంపించారు. ఆ తర్వాత అక్కడ నుంచి వివిధ మార్గాల ద్వారా ఇండియాకు తీసుకొచ్చారు.

Also Read: తండ్రి పోలికలతో కొడుకు.. ఆ కోపంతో చిన్నారిని హింసించి చంపిన సీఈవో!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు