Putin: మా లక్ష్యాలు నెరవేరేవరకు యుద్ధం ఆపేది లేదు.. పుతిన్ సంచలన వ్యాఖ్యలు ఉక్రెయిన్‌పై తమ లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదని.. తమ లక్ష్యాలు నెరవేరేవరకు శాంతి నెలకొల్పడం వీలు కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌కు నాజీల నుంచి విముక్తి కల్పించి.. నిస్సైనికీకరణ జరిగేలా, నాటోలో చేరకుండా తటస్థంగా ఉండేలా చేయడమే తమ లక్ష్యాలని తెలిపారు. By B Aravind 15 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Russia-Ukraine War: గత ఏడాది ఫిబ్రవరలో మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఇరుదేశాల దాడులు చేసుకోవడం వల్ల ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తమ నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై తమ లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదని.. తమ లక్ష్యాలు నెరవేరేవరకు శాంతి నెలకొల్పడం వీలు కాదని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌కు నాజీల నుంచి విముక్తి కల్పించి.. నిస్సైనికీకరణ జరిగేలా చూడటం.. అలాగే నాటోలో చేరకుండా తటస్థంగా ఉండేలా చేయడమే తమ లక్ష్యాలని తెలిపారు. ఇప్పటికే 24 ఏళ్లుగా రష్యాను (Russia) పాలిస్తూ.. మళ్లీ ఇప్పుడు అధ్యక్ష బరిలో దిగుతున్న పుతిన్ తాజాగా మాస్కోలో మీడియాతో మాట్లాడారు. అయితే ఈసారి కేవలం విలేకరులు మాత్రమే కాకుండా సాధారణ పౌరులు కూడా ఫోన్ చేసి అధ్యక్షుడ్ని తమ సమస్యలపై ప్రశ్నలు అడిగేందుకు కూడా వీలు కల్పించారు. అయితే రెండు వారాల్లోనే ఏకంగా 20 లక్షల ప్రశ్నలు వచ్చాయి. 2021లో చివరిసారిగా పుతిన్ (Putin) మీడియాతో మాట్లాడారు. ఇప్పడు తాజా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము గత ఏడాది చేపట్టిన సైనిక చర్య కోసం 6,17,000 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు వెళ్లారని.. మరింత బలగాల సమీకరణ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటివరకు 4,86,000 మంది ఒప్పందాలపై సంతకాలు చేసి సైన్యంలో చేరారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ (Ukraine) ఎదురుదాడులు చేసినట్లు చెబుతున్నప్పటికీ కూడా ఆ దేశం సాధించింది ఏమి లేదన్నారు. Also Read: పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన.. లొంగిపోయిన కీలక సూత్రధారి.. పాశ్చత్య దేశాల నుంచి సాయం పొందేందుకు ఏదో చేసినట్లు చెప్పుకుంటూ బలగాలను బలిపెడుతోందంటూ ఉక్రెయిన్ తీరుపై విమర్శల వర్షం గుప్పించారు. అయితే ఈ విషయంలో ఉక్రెయిన్ మూర్ఖంగా, బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉక్రెయిన్‌ను అడ్డం పెట్టుకొని సోదరుల మధ్య యుద్ధం జరిగేలా పాశ్చాత్య దేశాలు మద్దతు తెలుపుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వచ్చే ఏడాది రష్యాలో బ్రిక్స్ సదస్సు జరగనుందని తెలిపారు. అయితే ఈ సదస్సును ప్రపంచంలోని సమానవకాశాలకు అంకితమ చేస్తామని వెల్లడించారు. ఇదిలాఉండగా.. రష్యాలో మార్చిలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్యాలో పవర్‌ఫుల్ లీడర్‌గా ఉన్న పుతిన్ మరోసారి అధ్యక్షుడు అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. #telugu-news #vladimir-putin #russia-ukraine-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి