Manipur: మణిపూర్ హింసకాండలో వాళ్ల ప్రమేయమే ఉందా: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..

మణిపూర్ అల్లర్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో ఎన్నో ఏళ్ల నుంచి మెయిటీలు, కుకీలు కలిసి ఉంటున్నారని.. ఒక్కసారిగా హింస ఎలా చెలరేగిందని ప్రశ్నించారు. వాస్తవానికి అక్కడ హింస జరగలేదని.. జరిగేలా చేయిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇందులో విదేశీ శక్తుల పాత్ర ఏమైనా ఉందా.. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు విదేశీ శక్తులకే మేలు చేస్తాయని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

New Update
Manipur: మణిపూర్ హింసకాండలో వాళ్ల ప్రమేయమే ఉందా: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..

ఈ ఏడాది మే నెలలో చెలరేగిన మణిపూర్ అల్లర్లు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన సోషల్ మీడియాలో వైరలవ్వడం దేశ ప్రజల్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ఘటనను విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ స్పందించాలని.. పార్లమెంటులో కూడా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాయి. అయితే ఈ తీర్మానం విఫలమైనప్పటికీ దీనిపై స్పందించిన ప్రధాని మోదీ మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత కూడా పలుచోట్ల అల్లర్లు జరిగాయి. అయితే తాజాగా మణిపూర్ అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. సమస్యల నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన జీ20 సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు భారతదేశ భిన్నత్వంలోని ఏకత్వాన్ని చూసినట్లు చెప్పారు. దసరా పండుగ సదర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే మణిపూర్ అంశంపై మాట్లాడారు. మణిపూర్ హింసాకాండలో విదేశీ శక్తుల ప్రమేయం ఉందా అంటూ ప్రశ్నించారు.

Also Read: ఆ రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల పర్వం.. ఎంతమంది పోటీ చేయనున్నారంటే

మణిపూర్‌లో ఎన్నో ఏళ్ల నుంచి మెయిటీలు, కుకీలు కలిసి ఉంటున్నారని.. ఒక్కసారిగా ఇలా హింస ఎలా చెలరేగిందని ప్రశ్నించారు. వాస్తవానికి అక్కడ హింస జరగలేదని.. జరిగేలా చేయిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇందులో విదేశీ శక్తుల పాత్ర ఏమైనా ఉందా.. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు విదేశీ శక్తులకే మేలు చేస్తాయని పేర్కొన్నారు. కొందరు సంఘ వ్యతిరేక శక్తులు తాము సాంస్కృతిక మార్క్సిస్టులాగా చెప్పుకుంటున్నారని... కానీ వారు మార్క్స్‌ను మరిచిపోయారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని అభ్యర్థించారు.

ఇదిలా ఉండగా.. మెయిటీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేయడంతో.. మే 3న మైతేయ్‌, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో హింసాత్మక పరిస్థితులు రోజురోజుకు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర రక్షణశాఖ, హోంశాఖ దాదాపు 40 వేల మంది ఆర్మీ, పారామిలటరీ దళాలతో సహా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మణిపూర్‌లో మోహరించింది. అయినప్పటికీ అక్కడక్కడా ఘర్షణలు తలెత్తినా కూడా.. హింసాత్మక ఘటనలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు