Fuel Prices: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయాల్లో స్థిరత్వం వచ్చిన తర్వాతే చమురు ధరల తగ్గింపు సాధ్యం అవుతుందన్నారు. 2021 నుంచి కేంద్రం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని తెలిపారు.

New Update
Petrol-Diesel: వాహనదారులకు బిగ్ షాక్.. 3 రూపాయలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Fuel Prices:  దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్  కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయాల్లో స్థిరత్వం వచ్చిన తర్వాతే చమురు ధరల తగ్గింపు సాధ్యం అవుతుందన్నారు. నవంబర్ 2021, మే 2022 మధ్య రెండు సార్లు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించినట్లు గుర్తు చేశారు. ఈ తగ్గింపుతో దాదాపు రూ. 2.2 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇంధన ధరలను తగ్గించడానికి మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యల గురించి తెలిపారు.

కేంద్ర మంత్రి మాట్లాడుతూ..నవంబర్ 2021, మే 2022 మధ్య పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ. 13, రూ. 16 తగ్గింది. తగ్గింపుల ఫలితంగా రూ. 2.2 లక్షల కోట్ల ఆదాయం కేంద్రం కోల్పోయింది. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించే అవకాశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ చమురు ధరల స్థిరీకరణపై రిటైల్ ఇంధన ధరలను తగ్గించే నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు.భౌగోళిక పరిస్థితి స్థిరంగా ఉంటే, చమురు ధరలు స్థిరంగా ఉంటే, తగ్గించే అంశంపై ద్రుష్టిపెట్టవచ్చన్నారు.

భారత్ వెలుపల, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగుపడాలి. అప్పుడే చమురు ధరల్లో స్థిరత్వం అనేది వస్తుంది. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఫోకస్ పెడతాం. అయితే ప్రపంచంలో ఎక్కడో ఒక చోట దాడులు జరిగినా సరుకు రవాణా, బీమా ధరలు పెరుగుతున్నాయని మంత్రి అన్నారు. దీంతో చమురు మార్కెట్లో అస్థిరతలు నెలకొంటున్నాయని కేంద్రమంత్రి తెలిపారు.

కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ ధరలను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్యాస్ ధరలలో ఈ తగ్గింపు గత ఏడాది రక్షా బంధన్ సందర్భంగా ప్రకటించిన రూ.200 కోత ఎక్కువగా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు రూ.300 ఎల్‌పిజి సబ్సిడీని వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ చర్యలతో, ప్రామాణిక 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 803, ముంబైలో రూ. 802.50, కోల్‌కతాలో రూ. 829 చెన్నైలో రూ. 818.50. ఉజ్వల వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ ధర - సబ్సిడీ ప్రయోజనంతో సహా - ఢిల్లీలో రూ. 503, ముంబైలో రూ. 502.50, కోల్‌కతాలో రూ. 529 చెన్నైలో రూ. 518.50గా ఉంది.

ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ బీజేపీ పొత్తుల క్రీడ.. ఏమిటో ఆ వ్యూహం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Amazon Great Summer Sale: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

New Update
Amazon great summer sale

Amazon great summer sale

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. వచ్చే నెల మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

5 శాతం వరకు డిస్కౌంట్..

ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లుకు 10 శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తోంది. దీంతో పాటు క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై కూడా డిస్కౌంట్‌ లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుదారులకు అయితే 5 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. వీటితో పాటు క్యాష్‌బ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్స్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ వంటివి కూడా ఈ సేల్ ద్వారా ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా.. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్‌లను ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా, ఐక్యూ నియో 10R, ఐఫోన్ 15, వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్, వన్ ప్లస్ 13ఆర్,  గెలాక్సీ ఎమ్ 35 5జీ, వన్ ప్లస్ నోర్డ్ 4, ఐక్యూ జెడ్ 10ఎక్స్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

వీటితో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా ఆఫర్లను ప్రకటించనుంది. హెచ్‌పీ, లెనోవా వంటి వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. వీటితో పాటు స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు ఇతర వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. పొందగలుగుతారు, దీని వలన మీ కొనుగోళ్లు మరింత సరసమైనవిగా మారుతాయి.

 

mobiles | amazon-great-summer-sale | discounts | laptops

Advertisment
Advertisment
Advertisment