Buchi Babu: 'ఆర్ఆర్ఆర్' కాంబో రిపీట్.. 'ఉప్పెన' డైరెక్టర్ బిగ్ ప్లాన్!

'ఉప్పెన'ఫేమ్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న అప్ కమింగ్ మూవీ #RamCharan16 నుంచి మరో అప్ డేట్ వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న మూవీలో 'ఆర్ఆర్ఆర్' కాంబో రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవ్ గన్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు టాక్.

New Update
Buchi Babu: 'ఆర్ఆర్ఆర్' కాంబో రిపీట్.. 'ఉప్పెన' డైరెక్టర్ బిగ్ ప్లాన్!

Ram Charan RC16: మెగా హీరో రామ్ చరణ్ మరో ప్రాజెక్టుకు సంబంధించి బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' (Game Changer) సినిమా చేస్తున్న చెర్రీ ఈ మూవీ పూర్తి కాకుండానే తర్వాత తన 16వ చిత్రం 'ఉప్పెన' (Uppena) ఫేమ్ బుచ్చిబాబుతోనూ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ కాంబోపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతుండగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

కబడ్డీ ప్లేయర్‌గా..
ఈ మేరకు ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌లో తెరకెక్కబోతున్న మూవీలో హీరో కబడ్డీ ప్లేయర్‌గా (Kabaddi Player) నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనున్న ఈ సినిమాలో స్టార్ నటులు భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ నటి లయ ఓ కీలక పాత్రలో నటించనుండగా విలన్‌గా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే, శివ రాజ్‌కుమార్ కూడా నటిస్తున్నాడని టాక్ నడుస్తుండగా తాజాగా మరో హీరో ఇందులో జాయిన్ కాబోతున్నట్లు చర్చ నడుస్తోంది.

ఇది కూడా చదవండి : Megastar: ‘విశ్వంభర’లో నయా లుక్.. చిరు జిమ్ బాడీ చూస్తే గూస్ బంప్సే!

అజయ్ దేవగణ్‌..
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌ను (Ajay Devagan) తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ చిత్రంలో హీరోకు సహాయం చేసే ఓ పాజిటివ్ రోల్‌లో కనిపించబోతున్నారని, 'ఆర్ఆర్ఆర్'సెంటిమెంట్ ను ఇందులో వాడుకునేందుకు బుచ్చిబాబు (Buchi Babu) ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ మూవీని సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ (A R Rahman) సంగీతం అందించనున్నాడు.

#Ram Charan #rc16 #ram-charan-16 #rrr-combo-repeat #buchi babu
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎం...

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment