RRB: 5,696 రైల్వే ఉద్యోగాల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం RRB నోటిఫికేషన్‌ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ ద‌ర‌ఖాస్తు గ‌డువు ఇవాళ్టితో ముగియ‌నుంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది.

New Update
RRB: 5,696 రైల్వే ఉద్యోగాల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!

RRB ALP 2024: అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హత, అశక్తి ఉండి అప్లై చేసుకోని వాళ్లు ఉంటే ఈ న్యూస్‌ మీకోసమే. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించనున్న అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఎగ్జామ్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి(ఫిబ్రవరి 19)తో ముగియనుంది. RRB అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. RRB ALP-2024 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలను బోర్డు భర్తీ చేయనుంది.

వయో పరిమితి
➼ ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు జూలై 1, 2024 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ, 30 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:
➼ RRB ALP 2024 దరఖాస్తు రుసుము SC, ST, Ex-Serviceman, మహిళలు, మైనారిటీ, EBC కేటగిరీ అభ్యర్థులకు రూ. 250. మిగతా వారందరికీ దరఖాస్తు రుసుము రూ. 500.

నియామక ప్రక్రియ:
➼ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఐదు దశలను కలిగి ఉంటుంది:
➼ మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1)
➼ రెండో దశ (CBT 2)
➼ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)
➼ డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
➼ వైద్య పరీక్ష (ME)
➼ అవసరమైన పత్రాలు

అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌తో పాటు కింది పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి:
➼ JPEG ఫార్మెట్‌లో రిసెంట్‌ కలర్‌ పాస్‌పోర్ట్ ఫొటో ఉండాలి. ఫైల్ సైజ్‌ 30-70 KB ఉండాలి.
➼ JPEGలో స్కాన్ చేసిన సంతకం ఉండాలి. ఫైల్ సైజ్‌ 30-70 KB ఉండాలి.
➼ SC, ST సర్టిఫికేట్ (వర్తిస్తే) PDF ఫార్మెట్‌లో ఉండాలి. సర్టిఫికేట్ సైజ్‌ 500 KBకి మించకూడదు. ఉచిత రైలు ప్రయాణ పాస్ కోసం SC, ST సర్టిఫికేట్ అవసరం.

➼ RRB అభ్యర్థులు కనీసం 12 ఫోటో కాపీలను ఉంచుకోవాలి. ఇది తరువాతి దశలలో అవసరమవుతాయి.

విద్యా అర్హత:
➼ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో/టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వెహికల్), వైర్‌మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్‌ కోయిల్‌లలో అనుభవం ఉండాలి. గుర్తింపు పొందిన NCVT/SCVT సంస్థ నుంచి మెకానికల్ (డీజిల్), హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ట్రేడ్‌లలో ITI ఉత్తీర్ణులై ఉండాలి.

Also Read: గూడ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం అందుకోసమే.. దీని స్పెషాలిటీస్ ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

JOBS: ఎస్బీఐ పీవో ఫలితాల విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డీవోబీ, క్యాప్చా ఇచ్చి ఫలితాలను తెలుసుకోవచ్చును. 

New Update
SBI ATM Business ideas

SBI ATM Business ideas

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. గత నెల 8, 16, 24, 26 తేదీల్లో ఈ ఎగ్జామ్స్ జరిగాయి. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాల ఖాళీల భర్తీ చేయనుంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫలితాలు ఈ కింది వెబ్ సైట్ లో ఉంటాయి. 

https://sbi.co.in/web/careers/crpd/po-pre-2024-results

 

 today-latest-news-in-telugu | jobs

Also Read: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment