World Cup 2023: ఏకంగా 9మంది బౌలింగ్ చేశారు..రోహిత్, కోహ్లీకి వికెట్లు

నిన్నటి నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టేసింది. సెంచరీలు, హాఫ్ సెంచరీలతో బ్యాటర్లు అదరగొట్టారు. దానికి తోడు 11ఏళ్ళ తర్వాత రోహిత్, 9 ఏళ్ళ తర్వాత కోహ్లీ వికెట్లు తీసి ఫ్యాన్స్ కు కన్నుల పండుగ చేశారు.

New Update
World Cup 2023: ఏకంగా 9మంది బౌలింగ్ చేశారు..రోహిత్, కోహ్లీకి వికెట్లు

World Cup 2023: వరల్డ్ కప్ లో భారత్ కు తిరుగులేకుండా పోయింది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకుపోతోంది టీమ్ ఇండియా (Team India). ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగి పసికూనను మట్టికరిపించారు. కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్‌లు సెంచరీలు చేస్తే రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్నటి మ్యాచ్‌లో (Ind vs Ned) మరో ఇంట్రస్టింగ్ విషయం జరిగింది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి 400 స్కోరు కొట్టింది. దాంతో అక్కడే సగం విజయం ఖరారు అయిపోయింది. దీంతో భారత్ ప్రయోగాలు చేసింది. మొట్టమొదటిసారి ప్రపంచకప్‌లో తొమ్మది మంది భారత బౌలర్లు బౌలింగ్ కు దిగారు. రెగ్యులర్ బౌలర్లతో పాటూ విరాట్ (Virat Kohli), రోహిత్ (Rohit Sharma), గిల్, సూర్య కుమార్‌లు కూడా బౌలింగ్ చేశారు. అంతేకాదు 11 ఏళ్ళ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, 9 ఏళ్ళ తర్వాత కింగ్ కోహ్లీలో చెరో వికెట్ తీసుకున్నారు. ఇది నిజంగా ఫ్యాన్స్ కు పండుగే. ఇద్దరు టాప్ క్లాస్ బ్యాటర్లు భారత ప్రజలకు దీపావళి కానుక ఇచ్చారు.

Also Read:బాధలు పడుతున్నా…బుద్ధిరాలేదు.. ఢిల్లీలో పేలిన టపాసులు

View this post on Instagram

A post shared by ICC (@icc)

View this post on Instagram

A post shared by ICC (@icc)

విరాట్‌.. స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ వికెట్‌ తీయగా, రోహిత్‌.. నెదర్లాండ్స్‌ టాప్‌ స్కోరర్‌ తేజ నిడమనూరు వికెట్‌ పడగొట్టాడు. రోహిత్‌ చివరిసారిగా 2012 ఫిబ్రవరిలో వన్డే వికెట్‌ తీశాడు. నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ వేడ్‌ వికెట్‌ దక్కించుకున్నాడు. రోహిత్‌ తన కెరీర్‌లో తొమ్మిది వన్డే వికెట్లు, రెండు టెస్ట్‌ వికెట్లు, ఓ టీ20 వికెట్‌ పడగొట్టాడు.

నిన్నటి మ్యాచ్‌లో మరో ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగింది. మొత్తం మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మొదట ఓవర్లో విరాట్ 7 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్ అయిన తర్వాత కోహ్లీ స్టాండ్స్‌లో ఉన్న తన భార్య అనుష్కను చూస్తూ బౌలింగ్ చేశా కదా కనీసం చప్పట్లు కూడా కొట్టవా అంటూ సైగలు చేశాడు. దానికి అనుష్క నవ్వడం హైలట్ గా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. కోహ్లీ 70 పరుగులు, పడిక్కల్ 50 పరుగులతో చెలరేగిపోయారు.

New Update
RCB Vs RR

RCB Vs RR

టార్గెట్ ఎంతంటే?

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

రికార్డు మిస్

కోహ్లీ మొత్తంగా మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేవాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా కొత్త రికార్డును క్రియేట్ చేసేవాడు. కానీ మూడు సిక్సుల్లో రెండు మాత్రమే కొట్టడంతో ఆ రికార్డు మరో మ్యాచ్‌ కోసం షిఫ్ట్ అయింది. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరిట 299 సిక్సులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మరొక ప్లేయర్ హాఫ్ సెంచరీ చేశారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (50) చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

telugu-news | virat-kohli | IPL 2025 | rcb-vs-rr | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment