Rohit and Kohli : టీమిండియాలో ఇద్దరూ ఇద్దరే! భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పేజీలు వారివే!

టీమిండియా అద్భుత విజయం సాధించింది. మరోవైపు ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు టీ20 ఫార్మేట్ కు వీడ్కోలు పలికారు. వారి నిష్క్రమణ ఒకవైపు.. విజయోత్సవాలు మరోవైపు టీమిండియా అభిమానుల్లో చెప్పలేని ఎమోషన్ తెచ్చాయి. రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ ఇద్దరి ప్రయాణం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
Rohit and Kohli : టీమిండియాలో ఇద్దరూ ఇద్దరే! భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పేజీలు వారివే!

Team India : ఒక్క విజయం.. రెండు మహా నిష్క్రమణలు.. బహుశా టీమిండియా చరిత్రలో ఇలాంటి రోజు ఇప్పటివరకూ చూసి ఉండదు. ఒక పక్క ఘనవిజయం తెచ్చిన సంబరాలు మొదలవుతూనే.. విరాట్ కోహ్లీ (Virat Kohli) తన టీ20 కెరీర్ కు ఇది చివరి మ్యాచ్ అని చెప్పేశాడు. ఆ విషయాన్ని అభిమానులు అర్ధం చేసుకునే లోపులోనే.. కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మేట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. పదిహేడేళ్ల ఎదురుచూపుల తరువాత దక్కిన ట్రోఫీని భారత జట్టు ముద్దాడుతున్న ఆనందం కంటే.. ఇద్దరు దిగ్గజాలు ఒకేసారి ఈ ఫార్మేట్ నుంచి పక్కకు జరిగిపోతున్నారన్న బాధ అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే భారత క్రికెట్ చరిత్రలో జూన్ 29 ఒక అద్భుతమైన పేజీగా మిగిలిపోతుంది. 

ఇద్దరూ ఇద్దరే..
Rohit and Kohli :  రోహిత్ (Rohit Sharma).. విరాట్ ఇద్దరూ కెరీర్ లో ఒడిదుడుకులు చూసినవారే. క్రికెట్ నే శాసిస్తూ.. టీమిండియా కోసం వారిద్దరూ పడ్డ కష్టాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు. అందులోనూ టీ20 ఫార్మేట్ లో వారిద్దరి ముద్ర చెరిపివేయలేనిది. వారిద్దరి ఫుట్ ప్రింట్స్ లోనే ఇప్పటి నవతరం క్రికెటర్లు ముందుకు సాగుతారంటే అతిశయోక్తి కాబోదు. ఇద్దరి అభిమానుల మధ్య ఒకరకమైన ఫైట్ నడుస్తూ ఉంటుంది. కానీ.. రోహిత్.. విరాట్ ఇద్దరి మధ్యలో చక్కని సమన్వయం ఉంది. కష్టకాలంలో ఒకరిని ఒకరు సమర్ధించుకుంటూ ముందుకు సాగిన స్నేహం ఉంది. విజయం కోసం చేసే ప్రయత్నంలో ఫీల్డ్ లో సమిష్టి కృషి ఉంది. కెరీర్ పరంగా పోటీ ఎంత ఉన్నా.. కలిసి ఆడడం విషయంలో దానిని బయటపడనీయని చాకచక్యమూ ఉంది. అందుకే.. ఈ ఇద్దరినీ భారత టీ20 చరిత్రలో.. టీమిండియా టీ20 ప్రయాణంలో అత్యంత ప్రధానమైన ఇంధనంగా చెప్పవచ్చు. 

ఎవరికి  వారుగా..
టీ20 కెరీర్ పరంగా చూస్తే.. ఎవరికి వారుగా ఇద్దరూ ఒకరికి ఒకరు తీసిపోని స్థాయి ఉన్నవారే. కెప్టెన్.. ఆటగాడు ఇలా పాత్ర ఏదైనా నూరు శాతం తమ మార్క్ చూపించారు. ఒకసారి రోహిత్ శర్మ టీ20 ప్రయాణాన్ని పరిశీలిస్తే.. రోహిత్ శర్మ టీమ్ ఇండియా తరఫున మొత్తం 159 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 151 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో 3003 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 4231 పరుగులు చేశాడు. వీటిలో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక విరాట్ జర్నీ చూస్తే.. టీమిండియా తరుపున 125 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తం 117 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో మొత్తం  3056 బంతులు ఎదుర్కొని 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా 38 అర్ధసెంచరీలు, 1 భారీ సెంచరీ సాధించాడు.

ఈ లెక్కలు చాలు ఇద్దరి వ్యక్తిగత ప్రతిభ గురించి చెప్పడానికి. ఇంకా చెప్పాలంటే.. రోహిత్ శర్మ టీమిండియాలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకూ అన్ని టీ20 ప్రపంచ కప్ లు ఆడాడు. తన మొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో రోహిత్ ఆడాడు. అప్పుడు టీమిండియా కప్ గెలిచింది. ఇప్పుడు తన చివరి టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) లో కెప్టెన్ గా టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఇది కదా ఏ ఆటగాడికైనా కావలసింది. ఇక విరాట్ కూడా తక్కువ కాదు. రోహిత్ కన్నా చిన్నవాడైన కోహ్లీ తన టీ20 కెరీర్ అతని తరువాత 2010లో ప్రారంభించాడు. కానీ.. రోహిత్ సమానమైన పరుగులు చేశాడు. అతనికి సెంచరీల రికార్డ్ లేకపోవచ్చు. కానీ, టీమ్ విజయానికి అవసరమైన పరుగులు.. అవసరమైన సమయంలో చేయడంలో కోహ్లీని మించిన వారు లేరు. ఎప్పుడు టీమిండియా కష్టంలో ఉంటె అపుడు.. ముఖ్యంగా ఛేజింగ్ లో కోహ్లీని మించి ఆదుకున్న బ్యాటర్ ఎవరూ ప్రస్తుతం టీమిండియాలో లేరు అనేది నిజం. 

మొత్తంగా చూసుకుంటే.. విరాట్.. రోహిత్.. ఇద్దరూ ఇద్దరే. సమకాలీన క్రికెట్ లో ప్రపంచంలోనే అద్భుతమైన ఆటగాళ్లు ఇద్దరూ. ఈ ఇద్దరూ ఒకేసారి టీమిండియాను వీడిపోతుండటం కాస్త బాధాకరమే. అభిమానుల దృష్టిలో చూస్తే చాలా బాధాకారం. కానీ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నవారే విజేతలు అవుతారు. అది ఆటైనా.. జీవితమైనా.  సరిగ్గా ఇప్పుడు ఇద్దరూ చేసింది అదే. ఒక అద్భుత విజయంతో.. హై ఫై వైబ్రేషన్స్ మధ్య సగౌరవంగా టీ20 కెరీర్ కి ఇద్దరూ ముగింపు చెప్పడం ఇద్దరి ఆలోచనా విధానంలోని.. ఇద్దరి మధ్య ఉన్న బంధంలో గొప్పతనాన్ని చెబుతోంది. టీమిండియాలో ఈ ఇద్దరి ప్లేస్ లో మరో ఇద్దరిని చూడగలమో లేదో చెప్పడం కష్టం. వారి రికార్డులు బద్దలు కొట్టే వారు రావచ్చేమో కానీ, వారిద్దరి మధ్య ఉన్న సమన్వయ.. సమర్ధనీయ.. సమిష్టి కృషి ఉన్న ఆటాగాళ్ళు టీమిండియాకు దొరకడం కష్టమే! 

Also Read : కోహ్లీ కాదు, రోహిత్‌ కాదు.. టీమిండియా టాప్‌ హీరో బుమ్రానే.. ఎలాగంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు