/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/america-2-jpg.webp)
Road Accident : అమెరికాలో(America) ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా(NTR District) పెనుగంచిప్రోలు(Penuganchiprolu) మండలం కొణకంచి గ్రామానికి చెందిన నరేశ్- గీతాంజలి దంపతులు పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.
వారిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు(Software Engineers) గా పనిచేస్తున్నారు. వారికి ఓ బాబు, పాప హానిక (6) ఉన్నారు. ఆదివారం హానిక పుట్టినరోజు సందర్భంగా అందరూ కారులో గుడికి బయల్దేరారు. కారు(Car Accident) పోర్టులాండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దీంతో హానిక అక్కడికక్కడే మృతి చెందింది. గీతాంజలికి బలమైన గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది.
ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కొణకంచి గ్రామంలో ప్రమాదం గురించి తెలియడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read : ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా.. గొంతులో చేప ఇరుక్కుని బాలుడి నరకయాతన!