Cricket: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రికీ పాంటింగ్ అవుట్..

ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌ను పదవి నుంచి తప్పించింది. ఏడేళ్లుగా జట్టు ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవడంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ యజమానులు రికీ పాంటింగ్‌ను తొలగించారని తెలుస్తోంది.

New Update
Cricket: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రికీ పాంటింగ్ అవుట్..

IPL Cricket: ఐపీఎల్ 2025 సీజన్‌ మెగా వేలం మరికొన్ని రోజుల్లో జరగనుంది. దీనికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఓ నిర్ణయం తీసుకుంది. రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పిస్తున్నట్టు అనౌన్స్ చేసింది. 2025 ఐపీఎల్ మెగా వేలంలో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కీలక ఆటగాళ్ళు ఒక జట్టు నుంచి మరో జట్టుకు మారతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ళుగా జట్టు కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌ను కోచ్‌గా తప్పించింది. ఏడేళ్ళుగా రికీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అయితే ఈ జట్టు అనుకున్న ఫలితాలను మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోతోంది. అందుకే రికీని కోచ్ పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ ఫ్రాంఛైజీ యజమానులు భావించారు.

వచ్చే సీజన్‌లో కొత్త కోచింగ్‌ బృందంతో బరిలోకి దిగాలని ఢిల్లీ ఫ్రాంఛైజీ భావిస్తోంది. అసిస్టెంట్ కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రేను మాత్రం కొనసాగించే వీలుంది. డీసీకి టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సౌరభ్‌ గంగూలీ హెడ్ కోచ్‌ పదవి కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌గా రికీ పాటింగ్ బాధ్యతలు స్వీకరించాడు. 2024 సీజన్‌ వరకు ఆ బాధ్యతల్లో కొనసాగాడు. 2018లో ఢిల్లీ చివరి స్థానంలో నిలవగా.. 2019, 2021లో ప్లే ఆఫ్స్‌, 2020లో ఫైనల్‌కు చేరింది. గత మూడు సీజన్లలో డీసీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఏడు విజయాలు సాధించి ఆరో స్థానంలో నిలిచింది.

Also Read:Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్ళిలో ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్

Advertisment
Advertisment
తాజా కథనాలు