TS : గ్రూప్-2, 3 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!!

గ్రూప్ 2,3 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్ 2,3నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలపాలని ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

New Update
TSPSC పేరు మార్చనున్న రేవంత్ సర్కార్.. కొత్త పేరు ఇదే?

TSPSC : తెలంగాణలో కొలువుల భర్తీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగానే గ్రూప్ 2,3 నోటిఫికేషన్లలో అదనపు పోస్టులు కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 2 వలే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2022 గ్రూప్ 2 నోటిఫికేషన్లో కటాఫ్ తేదీ ప్రకారం 18 విభాగాల్లో 783ఖాళీలు ఉన్నాయి. అయితే ఇదివరకు పెరిగిన పోస్టులతో టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ వెలువడే అవకాశం కూడా ఉంది.

2022 డిసెంబర్ 30న విడుదలైన గ్రూప్ 3 అదనపు ఖాళీ పోస్టులను కలుపుకుని అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట 1362 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వగా..ఆ తర్వాత మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోస్టుల సంఖ్య 1375కు చేరుకుంది. ఈ పోస్టులకు అదనపు ఖాళీలను కలుపుకుని అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.

కాగా శుక్రవారం నుంచి గ్రూప్ 1 దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. 563పోస్టులతో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ బోర్డు తెలిపింది.

ఇది కూడా చదవండి:  దశాబ్దాల కల..ఎస్‌ఎల్‌బిసి పనులు త్వరగా పూర్తి చేయాలి:ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు