Elections : ఓటేయండి.. హాయిగా కావాల్సినంత తినండి, తాగండి

లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. మీరు కూడా ఓటేయడానికి వెళుతున్నారా..అయితే ఈ వార్త మీకోసమే. ఓటేసిట్లు ఇంక్ మార్క్ చూపించండి..కావాల్సినంత తిని, తాగండి అంటున్నాయి రెస్టారెంట్లు.

New Update
Elections : ఓటేయండి.. హాయిగా కావాల్సినంత తినండి, తాగండి

Cast Your Vote Take Offers : ఓటు ప్రతీ వారి హక్కు. ఇది వినియోగించుకోవడం ఎంతో అవసరం. అందుకే దీని మీద మరింత అవగాహన కలిగించేందుకు, ఓటింగ్ శాతం పెంచేందుకు నేషనల్ ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా(National Food Authority Of India) ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఓటేసి చేతి మీద ఇంక్ మార్క్ చూపిస్తే ఉచితంగా ఫుడ్, బీర్ ఇస్తామని ప్రకటించింది. ఓటేసిన తర్వాత రెస్టారెంట్లలో 20 శాతం వరకు డిస్కోంట్ పొందండి చెబుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ ఆఫర్ గౌతమ్ బుద్ధ నగర్, బెంగళూరు(Bangalore) లోని రెస్టారెంట్లు, హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. గ్రేటర్ నోయిడా, నోయిడా రెస్టారెంట్ల యజమానులు కూడా ఓటర్లకు రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. పైగా దీనికి డెమోక్రటిక్ ఆఫర్ అని పేరు పెట్టారు. నేషనల్ రెస్టారెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, గౌతమ్ బుద్ధ నగర్ ఓటు వేసిన వారికి ఆహారం, మందుపై 20 శాతం తగ్గింపును అందిస్తుంది.

ఈసారి లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల పోలింగ్ దేశంలో ఏడు దశల్లో జరగుతోంది. మొదటి దశ ఇప్పటికే పూర్తయింది. రెండో దశ పోలింగ్ ఈరోజు కొనసాగుతోంది. అయితే మొదటి దశ పోలింగ్ అనుకున్నంత స్థాయిలో అవ్వలేదు. అందుకే ఈ కారణంగానే ఓటర్లను ఉత్సాహపరిచేందుకు, వాళ్ళను ఓటు వేసే దిశగా ప్రేరేపించేందుకు నేషనల్ రెస్టారెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఆఫర్ నిర్ణయాన్ని తీసుకుందని...ఛైర్మన్ వరుణ్ ఖేడా చెప్పారు. అలాగే తొలిసారి ఓటు వేయడానికి వెళ్లే యువత కూడా ఈ ఆఫర్‌కు ఆకర్షితులవుతారని అంటున్నారు.

ఇక గ్రేటర్ నోయిడా(Greater Noida) లో చాలా రెస్టారంట్లలోనే ఆఫనర్లు నడుస్తున్నాయి. ఓటేసి వస్తే డిస్కౌంట్లు , కొన్ని చోట్ల ఫ్రీ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. నోయిడాలోని ఈ రెస్టారెంట్లలో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
* డి వాలెంటినో కేఫ్
* నోయిడా సోషల్
* గెటాఫిక్స్
* ఓస్టెరియా
* చికా లోకా
* ఎఫ్ బార్ నోయిడా
* జీరో కోర్ట్ యార్డ్ గార్డెన్స్ గ్యాలెరియా
* డర్టీ రాబిట్
* బేబీ డ్రాగన్
* ట్రిప్పీ టేకిలా
* కేఫ్ ఢిల్లీ హైట్స్
* చింగ్ సింగ్
* పాసో నోయిడా
* మోయిర్ కేఫ్ & లాంజ్
* బీర్ కేఫ్
* పాటియాలా కిచెన్
వీటితో పాటూ ఢిల్లీలోని సన్నీ లఇయోన్ రెస్టారెంట్‌ చికా లోకా రెస్టారెంట్‌లో కూడా ఆఫర్లు ఉన్నాయి. ఇక్కడ కేవలం చేతి మీద ఇంక్ గుర్తు చూపిస్తే చాలు ఆఫర్‌ను పొందవచ్చును. ఇక బెంగళూరులోని డెక్ ఆఫ్ బ్రూస్, రెస్టో-పబ్‌లలో ఇవాళే కాదు 27, 28 తేదీలలో కూడా ఓటర్లకు ఉచిత బీర్, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. దాంతో పాటూ టాక్సీ సర్వీస్ ప్రొవైడర్ రాపిడో బెంగళూరులో వికలాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్ల కోసం ఆటో క్యాబ్‌లు, బైక్ రైడ్‌లను అందజేస్తుంది.

Also Read:Elections 2024: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్..ఓటేసిన ప్రముఖులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment