Renu Desai: మీకు నా శాపం తగులుతుంది.. నెటిజన్లపై దుమ్మెత్తిపోసిన పవన్ మాజీ భార్య!

పవన్- అనా లెజినొవా దంపతులు అకీరా నందన్‌, ఆద్యలతో దిగిన ఫొటోపై వల్గర్ మీమ్స్ క్రియేట్ చేస్తున్న వారిపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మమ్మల్ని ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోవాలంటూ తిట్టిపోసింది.

New Update
Renu Desai: మీకు నా శాపం తగులుతుంది.. నెటిజన్లపై దుమ్మెత్తిపోసిన పవన్ మాజీ భార్య!

Pawan kalyan family: సోషల్ మీడియా వేదికగా తనను, తన పిల్లలు, కుటుంబంపై అభ్యంతరకర కామెంట్స్ చేస్తు్న్న వారిపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఫ్యామిలీ మెంబర్స్ ను ఎగతాళి చేసే వారికి కూడా ఇంట్లో ఒక తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోవాంటూ శాపనార్ధాలు పెట్టింది. ఈ మేరకు ఇటీవల ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్- అనా లెజినొవా దంపతులు అకీరా నందన్‌, ఆద్యలతో సరదాగా దిగిన ఫొటో నెట్టింట పోస్ట్ చేశారు. అయితే ఇది తెగ వైరల్ కావడంతో మీమ్స్, ట్రోల్స్ క్రియేట్ చేస్తూ నెటిజన్లు రెచ్చిపోయారు. దీంతో మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్‍స్టా వేదికగా రేణూ పోస్ట్ పెట్టింది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

'ఆ ఫొటోను నేను ఏ విధంగా క్రాప్‌ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని మీమ్స్‌, జోక్‌లు చేసే వారంతా మీకూ ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్‌స్టాలో చూసి నా కూతురు చాలా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్‌మీడియా, ఇంటర్నెట్‌ అకౌంట్లను సులభంగా యాక్సెస్‌ చేసి, విచక్షణ లేని వ్యక్తులుగా ఎదుగుతున్న తీరును చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తోంది. ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోండి. పొలినా, మార్క్‌ (అన్నా లెజినోవా, పవన్ కళ్యాణ్ పిల్లలు) సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు, మీమ్స్‌తో ప్రభావితం అవుతారు. ఇలాంటి మీమ్‌ పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది. ఈ పోస్ట్ చేయడానికి ముందు 100 సార్లు ఆలోచించా.. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది' అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ సుమో.. స్పాట్లో ఏడుగురు!

తిరుమలలో 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

New Update
ttd crime news

ttd crime news

AP Crime: తిరుమల నుండి తిరుపతికి వెళ్తున్న ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డుప్రమాదం భక్తుల్లో ఆందోళన కలిగించింది. సోమవారం ఉదయం 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ వాహనంలో ఏడుగురు కర్ణాటకకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్నారు. తిరుమలలో స్వామివారి దర్శనం పూర్తిచేసుకుని తిరుపతికి తిరుగుబాటుగా బయలుదేరిన ఈ వాహనం అతి వేగంగా వచ్చిన సమయంలో మలుపులో నియంత్రణ కోల్పోయింది. వాహనం బోల్తా పడటంతో అందులో ఉన్న వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

అతి వేగంతో..

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి సమాచారాన్ని పోలీసులకు, 108 ఎమర్జెన్సీ సర్వీసులకు అందించారు. వెంటనే రెస్క్యూ టీమ్‌ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన భక్తులను బయటకు తీసి చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగతావారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ వేగంగా నడిపిస్తున్నాడని, కొన్ని సార్లు మలుపుల్లో కాస్త భయంగా అనిపించినట్లు గాయపడిన ఓ భక్తుడు తెలిపారు.

 

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఘాట్ రోడ్డులో వాహనాల వేగంపై నియంత్రణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భక్తులు ప్రయాణ సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.   

ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

( ap-crime-news | ap crime updates | ap crime latest updates | latest-news)

Advertisment
Advertisment
Advertisment