Stress Management : డయాబెటిస్‌తో స్ట్రెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోండి! ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ రసాయనం గ్లూకోజ్ పెరగడానికి కారణమవుతుంది. అందుకే అధిక ఒత్తిడి షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడంతో షుగర్‌తో ఒత్తిడిని కంట్రోల్ చేయవచ్చు. By Vijaya Nimma 20 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Stress Management - Diabetes : అధిక ఒత్తిడి(Stress) అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఒత్తిడి రక్తంలో చక్కెరను కూడా ప్రభావితం చేస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. డయాబెటిస్, ఒత్తిడికి మధ్య డీప్ కనెక్షన్ ఉంది. ఏంటీ సంబంధం? : ప్రతి చర్యకు రియాక్షన్ ఉంటుంది. ఒత్తిడికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ రసాయనం గ్లూకోజ్ పెరగడానికి కారణమవుతుంది. ఇది డయాబెటిస్ రోగులకు(Diabetic Patients) సరైనది కాదు. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండండి. ఒత్తిడిని తగ్గించే మార్గాలు: టైప్ -2 డయాబెటిస్(Type-2 Diabetes) ఉన్నవారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా వ్యాయామం(Exercise), ధ్యానం చేయాలి. వారు అదనపు మందులు లేదా ఇన్సులిన్ తీసుకోవలసిన అవసరం లేదని అధ్యయనాలు కనుగొన్నాయి. కొన్ని రకాల యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా డయాబెటిక్ పేషెంట్లు తమను తాము ఆరోగ్యం(Healthy) గా ఉంచుకోవడంతో పాటు ఈ వ్యాధి తీవ్రతను దూరం చేసుకోవచ్చు. ఒత్తిడి కారణంగా పెరుగుతున్న రక్తంలో షుగర్ స్థాయిని నిర్వహించడం కష్టం. కానీ స్వీయ సంరక్షణ, ఆరోగ్యకరమైన దినచర్యను అవలంబించడం ద్వారా దీనిని చాలావరకు అదుపులో ఉంచవచ్చు. ఒత్తిడితో పాటు, షుగర్ లెవల్స్(Sugar Levels) పెరగడానికి కారణమేమిటో గమనించండి. ఆహారంలో కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించడం, తగినంత నిద్ర, రోజూ కొంత సమయం వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్ మాత్రమే కాకుండా అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీకు సంతోషం కలిగించే విషయాలకు సమయం ఇవ్వండి. అది నడక, నృత్యం లేదా సంగీతం, వీడియో గేమ్స్ ఆడటం లేదా స్నేహితులతో సమయం గడపడం లాంటివి ఏమైనా కావొచ్చు. ఇది కూడా చదవండి : ఈ విధంగా ఖర్జూరం తినండి.. ఒకేసారి 14 రకాల వ్యాధులు పరార్! గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #health-care #diabetes #stress-management #helth-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి