Health Tips : రెండు చేతులతో నమస్కారం చేయలేకపోతే షుగర్ ఉన్నట్టేనా? రెండు చేతులు జోడించి సహజంగా నమస్కారం చేసుకోలేని వారికి మధుమేహం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారిలో చేతులపై చర్మం గట్టిగా, బిగుతుగా మారుతుంది. మరోవైపు కీళ్లు కదిలించలేకపోతారు. ఏపనీ సరిగా చేయలేరని చెబుతున్నారు. By Vijaya Nimma 01 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Diabetes : సాధారణంగా మధుమేహాన్ని(Diabetes) రక్త పరీక్ష(Blood Test) ద్వారా గుర్తిస్తారు. కానీ రక్త పరీక్ష లేకుండా మధుమేహాన్ని గుర్తించడానికి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందింది అంటే మనిషి శరీరాన్ని చూసి అతని శరీరంలోని వ్యాధిని గుర్తించవచ్చు. తరచుగా జుట్టు రాలడం వంటి చర్మ సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో క్యాన్సర్(Cancer) ఉండవచ్చని అంటారు. అలానే అందరిలా రెండు చేతులు జోడించి సహజంగా నమస్కారం చేసుకోలేని వారికి మధుమేహం వస్తుందని అంటున్నారు. చీరో ఆర్థ్రోపతి అంటే?: దీర్ఘకాలిక మధుమేహం ఉన్నవారిలో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో చేతులపై చర్మం గట్టిగా, బిగుతుగా మారుతుంది. మరోవైపు కీళ్లు కదిలించలేకపోతారు. ఏపనీ సరిగా చేయలేరు. కొల్లాజెన్: షుగర్ ఉంటే మన కీళ్ల చుట్టూ పెద్ద మొత్తంలో కొల్లాజెన్(Collagen) పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఊబకాయం పెరిగినప్పుడు ఇలాగే జరుగుతుంది. మధుమేహం విషయంలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. రక్త ప్రసరణ తగ్గుతుందా? మధుమేహం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు మన రక్తనాళాల పరిమాణం మారుతుంది. ఇది మన శరీరంలోని వివిధ అవయవాలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఇది కళ్లు, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? ఫిజికల్ థెరపీ, షుగర్ కంట్రోల్ ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే కీళ్ల సమస్యలు తగ్గుతాయి. కాబట్టి మధుమేహం నుంచి కాపాడుకోవడానికి తరచుగా షుగర్ చెక్ చేసుకుని వైద్యులు సూచించిన మందులను వాడాలి. Also Read : Hyderabad Hit And Run : హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు మధుమేహం ఇతర లక్షణాలు: మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు కళ్లు, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాకుండా పక్షవాతం కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచుకోకపోతే అల్సర్లు, ఇన్ఫెక్షన్లతో పాటు చర్మ సమస్యలు, చెవుడు, దంతాల సమస్యలు కనిపిస్తాయి. గాయం త్వరగా నయం కాకపోతే షుగర్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు అంటున్నారు. వైద్యులు ఇచ్చే సలహా: ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం(Exercise), ప్రాణాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండడమే కాకుండా మధుమేహం కూడా రాకుండా ఉంటుందని అంటున్నారు. ఇది కూడా చదవండి: గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read : మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలను ఆకర్షించే పథకాలు! #health-tips #health-benefits #diabetes #sugar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి