Vizianagaram Train Accident:రాయగడ-పలాస రైలు ప్రమాదానికి కూడా కారణం కవచ్ సిస్టమే లేకపోవడమే.

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయింది...వందే భారత్ లాంటి స్పీడ్ ట్రైన్లను నడిపిస్తున్నాము. అయినా కూడా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం.. ఈ ఏడాది జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలాగే అనిపిస్తోంది. మరి ఆ ప్రమాదం నుంచి రైల్వే అధికారులు పాఠాలు నేర్చుకోలేదా? అయినా కూడా మళ్ళీ ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైల్వేస్ పెట్టిన కవచ్ సిస్టమ్ ఏమైందని అడుగుతున్నారు.

New Update
Train accident:వేగమే కొంపలు ముంచింది...విజయనగరం రైలు ప్రమాదం ప్రాథమిక నివేదిక

Vizianagaram Train Accident: జూన్‌, 2023లో ఒడిశా… బాలాసోర్ జిల్లాలోని బహనాగా స్టేషన్ దగ్గరలో రాత్రి 7 గంటల సమయంలో రైలు ప్రమాదం జరిగింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఆగివున్న గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది. కోరమండల్ రైలు బోగీలు పట్టాలు తప్పిన తర్వాత ఆ బోగీలను యశ్వంత్‌పూర్- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఆ మూడు రైళ్ల ప్రమాదంలో 17 బోగీలు పట్టాలు తప్పగా.. 275 మంది చనిపోయారు. కరెక్ట్‌గా ఇదే తరహాలో నిన్న రాత్రి 7.10 సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ముందు ఆగివున్న ప్యాసింజర్ రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత విద్యుత్ వైర్లు తెగిపోయాయి.

రెండు రైలు ప్రమాదాలు ఒకే రకంగా జరగడం...అది కూడా ఒడిశాలో ప్రమాదం జరిగిన 5 నెలల్లోనే మరొకటి అవడంతో ఇండియన్ రైల్వేస్ తీసుకువచ్చిన కవచ్ టెక్నాలజీ మీద అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు కవచ్ అనేది పనిచేస్తోందా లేదా అని డౌట్లు వస్తున్నాయి. కవచ్...ఒక యాంటీ కొలిజన్ టెక్నాలజీ సిస్టమ్. లోకో పైలట్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా రైలును నడిపితే కవచ్ సిస్టమ్ ట్రైన్‌ను ఆటోమేటిక్‌గా ఆపేస్తుంది. అంతేకాదు రెండు రైళ్ళు ఎదురెదురుగా వచ్చినా కూడా ఇది కాపాడుతుంది.

Also Read:వందే భారత్ ఢీకొని ముగ్గురు మృతి

అయితే ఇండియన్ రైల్వేస్ కవచ్ సిస్టమ్‌ను అన్ని రూట్లలో ఏర్పాటు చేయలేదు. కేవలం బాగా రైళ్ళు తిరిగే మార్గాల్లో, రద్దీ ఉండే రూట్లలో మాత్రమే ఏర్పాటు చేసింది. లాస్ట్ టైమ్ బాలాసోర్ దగ్గర ప్రమాదం జరిగినప్పుడు అక్కడ కవచ్ సిస్టమ్ లేదని తెలిసింది. ఇప్పుడు కూడా సిగ్నలింగ్ ప్రాబ్లెమ్ వల్లనే కంటకాపల్లి-అలమండ దగ్గర ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. దీనిబట్టి ఈ రూట్లో కూడా కవచ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేదా...లేక ఉన్నాసరే అది పని చేయలేదా అన్న విషయం ఇప్పుడు తెలియాల్సి ఉంది. దీనిపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన చెయ్యాల్సి ఉంది.

ఒడిశా, విజయనగరం...ఈ రెండు ప్రమాదాలూ దాదాపు ఒకేలా ఉన్నాయి. బాలాసోర్ ఘటన తర్వాత రైల్వే అధికారులు ఏం చేసినట్లు? రైల్వేల్లోని లోపాలను ఎందుకు సరిచేయలేకపోతున్నారు? రాన్రానూ రైళ్ల వేగం పెంచాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అది మంచిదే మరి అంతకు మించిన ప్రయాణికుల భద్రత మాటేంటి? అసలే ఎప్పుడో బ్రిటీష్ వాళ్లు వేసిన పట్టాల్లో ఇప్పటికీ చాలా వాటిని ఉపయోగిస్తుండటం మన రైల్వే వ్యవస్థలో పెద్ద లోపం. దానికి తోడు సిగ్నలింగ్ వ్యవస్థల్ని సక్రమంగా నిర్వహించలేకపోవడం మరో లోపం. ఒక ప్రమాదం జరిగిన తర్వాత అయినా లోపాలను సరిదిద్దుకోకపోవడం నిజంగా భయపెడుతోన్న అంశం. జపాన్ లాంటి దేశాల్లో గంటకు 350 కి.మీ వేగంతో దూసుకెళ్ళే రైళ్ళను నడుపుతూ మరీ ప్రమాదాలు జరగకుండా చూసుకుంటున్నారు. మన దేశంలో రైళ్ళ వేగం గంటకు 100 కి.మీ కూడా లేదు. కానీ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటికైనా రైల్వే వ్యవస్థ గుణపాఠాలు నేర్చుకుంటుందా? ప్రమాదాలు అరి కట్టే చర్యలు తీసుకుంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు