Real Estate Investments: రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి 

రియల్ ఎస్టేట్ రంగంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి. మార్చి త్రైమాసికంలో మూడు రెట్లు పెరుగుదల నమోదు చేసి రూ.5,743 కోట్ల రూపాయల పెట్టుబడులు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో వచ్చాయి. 

New Update
Real Estate Investments: రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి 

Real Estate Investments: రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంలో పెట్టుబడులు మార్చి త్రైమాసికంలో మూడు రెట్లు పెరిగి రూ.5,743 కోట్లకు చేరుకున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ Cushman & Wakefield (C&W) లెక్కల ప్రకారం, ఇది రియల్ ఎస్టేట్ రంగంలో(Real Estate Investments) మొత్తం పెట్టుబడిలో 63 శాతంగా ఉంది.  మార్చి త్రైమాసికంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు రూ. 8,830 కోట్ల నుంచి రూ. 9,124 కోట్లకు పెరిగాయని సీ అండ్ డబ్ల్యూ క్యాపిటల్ మార్కెట్స్ నివేదిక పేర్కొంది.

నివేదిక ప్రకారం, మొత్తం పెట్టుబడిలో, రెసిడెన్షియల్ విభాగంలో పెట్టుబడి రూ.5,743 కోట్లకు పెరిగింది.  ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,735 కోట్లుగా ఉంది. 2024 క్యాలెండర్ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆఫీస్ ప్రాపర్టీలో(Real Estate Investments) పెట్టుబడి స్వల్పంగా రూ. 2,248 కోట్లకు పెరిగింది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 2,180 కోట్లుగా ఉంది. అయితే, మిక్స్‌డ్ యూజ్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,645 కోట్ల నుంచి మార్చి త్రైమాసికంలో రూ.865 కోట్లకు తగ్గింది.

Also Read: కార్ల అమ్మకాలు తగ్గాయి.. టూవీలర్ అమ్మకాలు పెరిగాయి 

ఇండస్ట్రియల్ - లాజిస్టిక్స్ విభాగంలో కూడా మార్చి త్రైమాసికంలో రూ.268 కోట్ల పెట్టుబడులు(Real Estate Investments) వచ్చాయి.  గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.2,170 కోట్లుగా ఉంది. ఈ రివ్యూ చేస్తున్న త్రైమాసికంలో ఇన్వెస్టర్లు హోటల్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపలేదు. అయితే గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ విభాగంలో రూ.1,100 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ మొదటి త్రైమాసికంలో కూడా భారత రియల్ ఎస్టేట్ రంగంలోకి బలమైన మూలధన ప్రవాహాలు(Real Estate Investments) నమోదయ్యాయని C&W, వాల్యుయేషన్, అడ్వైజరీ, క్యాపిటల్ మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సోమి థామస్ తెలిపారు. ఇందులో, కొత్త కస్టమర్లు- పెట్టుబడిదారుల విశ్వాసం కారణంగా రెసిడెన్షియల్ రంగం ఆధిపత్యం వహించిందని రిపోర్ట్ చెబుతోంది. 

మొత్తంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులతో రెసిడెన్షియల్ విభాగంలోనే ఎక్కువ ఉన్నాయి. పెట్టుబడి దారులు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని అర్ధం అవుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు