IPL 2024: ఉప్పల్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RCB!

ఉప్పల్ వేదికగా నేడు జరుగుతున్న హైదరాబాద్ సన్ రైజర్స్- రాయల్ ఛాలెంజర్స్ మ్యా్చ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆర్ సీబీ. మొదిటి ఓవర్ లోనే 10 పరుగులు చేసింది. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఇరుజట్ల మధ్య 41 మ్యాచ్ జరగుతుంది.

New Update
IPL 2024: ఉప్పల్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RCB!

RCB Vs SRH: ఉప్పల్ వేదికగా నేడు జరుగుతున్న హైదరాబాద్ సన్ రైజర్స్- రాయల్ ఛాలెంజర్స్ మ్యా్చ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆర్ సీబీ. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఇరుజట్ల మధ్య 41 మ్యాచ్ జరగుతుంది. ఈ గ్రౌండ్ లో కోహ్లీకి (Virat Kohli) మంచి రికార్డు ఉండగా.. అభిమానులంతా కింగ్ షాట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి: Jonnavithula: ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సినీ గేయ రచయిత.. ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు!

ఇక ఈ మ్యాచ్ కు ముందు సన్‌రైజర్స్, ఆర్ సీబీ మధ్య చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగగా.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక (287)పరుగులు చేసింది ఎస్ ఆర్ హెచ్. ఈ మ్యాచులో ఆర్సీబీ కూడా 264 పరుగులు చేసింది. అయితే బౌలింగ్ వీక్ గా ఉన్న ఆర్సీబీ జట్టుపై ఉప్పల్ లో 300 స్కోర్ చేయాలని హైదరాబాద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ ఆర్ హెచ్ కు సొంత గ్రౌండ్‌లో సన్ రైజర్స్ కు తిరుగులేకపోగా.. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేసులో కొనసాగాలని చూస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణకు ఓకే.. రూ.1403 కోట్లతో కొత్త అసెంబ్లీ, హైకోర్టు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

New Update
AP Cabinet Meeting

AP Cabinet Meeting

AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇన్‌ సిటీస్‌ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

విశాఖలోని ఐటీహిల్‌ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించింది. బలిమెల, జోలాపుట్‌ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్‌ కన్సార్టియమ్‌కు కూడా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్‌, సౌర విద్యుత్‌ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

 

Advertisment
Advertisment
Advertisment