RBI: ఆ మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా..రూ. 10 కోట్ల జరిమానా చెల్లించాల్సిందే..!!

పెద్ద మొత్తంలో రుణాల జారీకి సంబంధించి నిబంధనలను అతిక్రమించినందుకు మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా ఝుళిపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంకులకు రూ. 10కోట్ల జరిమానా విధించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా.

New Update
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతిదీ ట్రాక్!

దేశీయ కేంద్ర బ్యాంకుగా కొనసాగుతున్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మూడు బ్యాంకుల గట్టి ఝలక్ ఇచ్చింది. భారీ మొత్తంలో పెనాల్టీ విధించింది. ఆర్బీఐ ఇంతకీ ఏయే బ్యాంకులకు జరిమానా విధించింది? ఎంత మొత్తంలో జరిమానా విధించింది?ఎందుకు పెనాల్టీ విధించిందో తెలుసుకుందాం.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు బ్యాంకులకు రూ. 10.34 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం వేరే వేరు ప్రకటనలను విడుదల చేసింది. ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ బ్యాంకు ఉంది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ లకు జరిమానా విధించినట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు సెలవులు..!!

భారీ మొత్తంలో రుణాలు జారీకి సంబంధించి ఆర్బీఐ నిబంధనలు పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 4.43కోట్ల పెనాల్టీ విధించింది. ఆర్థికపరమైన అవుట్ సోర్సింగ్ సర్వీసులకు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిబంధనలను అతిక్రమించినందుకు సిటీ బ్యాంకుకు రూ. 5కోట్లు...రుణాల జారీ విషయంలో నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కు రూ. కోటి జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. మార్చి 31, 2021లో ఆర్బీఐ తనిఖీల్లో ఈ విషయం బయటపడినట్లు తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు మాత్రమే మూడు బ్యాంకులకు జరిమానా విధించామని, ఖాతాదారుల లావాదేవీలకు ఈ జరిమానాలతో సంబంధం లేదని ఆర్బీఐ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: వడ్డీ లేకుండా హోం లోన్స్… సంచలన స్కీం ప్రకటించిన కేటీఆర్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు