తెలుగు సినీ జర్నలిస్టుల మద్దతుపై స్పందించిన రష్మిక.. పోస్ట్ వైరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘానికి థాంక్స్ చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన తన డీప్ ఫేక్ వీడియోను ఖండిస్తూ తనకు సపోర్టుగా నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేసింది. వాళ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

New Update
తెలుగు సినీ జర్నలిస్టుల మద్దతుపై స్పందించిన రష్మిక..  పోస్ట్ వైరల్

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘానికి థాంక్స్ చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన తన డీప్ ఫేక్ వీడియోను (Deep Fake Video) ఖండిస్తూ తనకు సపోర్టుగా నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేసింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

ఇక రష్మికను (Rashmika) అర్ధనగ్నంగా చూపించే వీడియో రాత్రికి రాత్రే వైరల్ కాగా దీనిపై సినీ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. మార్ఫింగ్  వీడియోను చూసి ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందారు. ఆ పర్స నాలిటీ చూడగానే రష్మిక కాదని తెలిసిపోతున్నప్పటికీ లోలోపల భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే వీడియోపై స్పందించిన అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి చర్యకు పాల్పడిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరమైన చర్యల తీసుకోవాలంటూ ఆయన డైరెక్ట్‌గా రంగంలోకి దిగారు. అంతేకాదు ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశవగా.. నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కవిత, కేటీఆర్ వంటి వారు కూడా నటికి సపోర్ట్ గా నిలిచారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ కేసు ఫైల్ చేసి ఆమెకు ధైర్యం చెప్పారు. దీంతో రీసెంట్ గా తనకు లభించిన మద్దతును ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టిన రష్మి.. తెలుగు జర్నలిస్ట్ లతో దిగిన ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి ఎమోషనల్ అయింది.

Also Read: రష్మికే కాదు..కత్రినా కైఫ్ కూడా డీప్ ఫేక్ బాధితురాలే.!

ఇదిలావుంటే.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక తెలుగులో 'రెయిన్ బో' అనే లేడీ సెంట్రిక్ మూవీ చేస్తోంది. అలాగే అల్లు అర్జున్‌తో 'పుష్ప ది రూల్' సినిమాలోనూ నటిస్తోంది. హిందీలో రణ్ బీర్ కపూర్ తో నటించిన 'యానిమల్' సినిమా కూడా డిసెంబర్ 1న విడుదలకానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు