Ram Charan Tej: దోశలు చేసిన రామ్ చరణ్.. ఫొటోలు వైరల్

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. తను ఏం చేసినా అవి వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో సంక్రాంతి పండగ సందర్భంగా రామ్ చరణ్ దోశలు వేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
Ram Charan Tej: దోశలు చేసిన రామ్ చరణ్.. ఫొటోలు వైరల్

Ram charan; సంక్రాంతి వచ్చిందంటే చాలు..మెగా ఫ్యామిలీ అంతా ఓకే చోట చేరి సెలబ్రేట్ చేసుకుంటారు.గతంలో బోగీ పండగ రోజు చిరంజీవి దోశలు వేస్తూ ఉంటే అందరూ ప్లేట్స్ పట్టుకుని క్యు కట్టే వీడియో ఎంత వరల్ అయ్యిందో తెలిసిందే. ఇదే క్రమంలో ఈ ఏడాది చెర్రీ దశలు వెయ్యడం జరిగింది.ఈ వీడియోను ఉపాసన
సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక.. మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా..చిరు, చెర్రీ దోశలు వేస్తున్న వీడియోలని ఫ్యాన్స్ జత చేస్తూ కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మెగా156 అప్డేట్

ఇక..మెగా స్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో తెరకెక్కుతోన్న మెగా156 చిత్రం టైటిల్ సంక్రాంతి కానుకగా జనవరి 15 అంటే రేపు రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు వశిష్ట ట్వీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ స్వీట్స్ పంచుకుంటున్నారు. ఈ పండగకు అసలు సిసలు ట్రీట్ ఇచ్చారని బాస్ ను పొగుడుతున్నారు.

చెర్రీ సినిమాల అప్డేట్స్

ఇక..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ సినిమా నుంచి ఈ సంక్రాంతికి ఎలాంటి అప్డేట్ అయినా వస్తుందేమో..లాస్ట్ మినిట్ లో అనౌన్స్ చేస్తారేమో అని అందరూ ఎదురు చూస్తున్నారు.సింహబాగం షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ లో చెర్రీ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్నారు. దిల్ రాజు 50 వ చిత్రంగా భారీ బడ్జెట్ తో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ మూవీ తరువాత ఉప్పెన బుచ్చిబాబు తో ఓ మూవీ ట్రాక్ ఎక్కనుంది. ఇప్పటికే ప్రి ప్రోడక్షన్ పనులు పూర్తి చేసుకున్న బుచ్చిబాబు - చెర్రీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏమయినా రిలీజ్ చేస్తారెమో అనీ ఎదురు చూస్తున్న తరుణంలో చెర్రీ దోశలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్స్ పెడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చరణ్ బర్త్ డే స్పెషల్

మెగా అభిమానులు ఆశించినట్టుగానే చెర్రీ బర్త్ డే మార్చి 27నాటికి గేమ్ చేంజర్ మూవీ నుంచి రాబోయే అప్డేట్ అదిరిపోతుందని అంటున్నారు.అప్పటికి బుచ్చిబాబు సినిమా కూడా ట్రాక్ ఎక్కుతుంది కాబట్టి ఈ సినిమా నుంచైనా అప్డేట్ రావచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.చూడాలి మరి.. చరణ్ ఎలాంటి ట్రీట్ ఇవ్వనున్నారో.

Advertisment
Advertisment
తాజా కథనాలు