Tamil Nadu: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన రజనీకాంత్.. ఏమన్నారంటే దళపతి విజయ్ రాజకీయ ప్రవేశంపై సీనియర్ నటుడు రజనీకాంత్ స్పందించారు. యువకులు రాజకీయాల్లోకి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘విజయ్‌కు నా శుభాకాంక్షలు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘తమిళగ వెట్రి కట్చి’ పేరుతో విజయ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. By srinivas 06 Feb 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Rajinikanth: తమిళ సినీ నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయ ప్రవేశంలపై సీనియర్ నటుడు రజనీకాంత్ (Rajinikanth) స్పందించారు. ఇటీవల ‘తమిళగ వెట్రి కట్చి’ పేరుతో విజయ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. కాగా దీనిపై రజనీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు తమిళనాడులో (Tamilnadu) అవినీతి పెరిగిపోయిందంటూ స్టాలిన్ (Stalin) ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అయితే ఒకవైపు వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ పొలిటికల్ ఎంట్రీ తమిళ రాజకీయాలను కుదిపేయనుంది. ‘విజయ్‌కు నా శుభాకాంక్షలు.. అయితే కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన చిత్రం‘లాల్ సలామ్’ (Lal Salaam) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న రజనీ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘విజయ్‌కు నా శుభాకాంక్షలు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. బలోపేతం చేసే దిశగా.. ఇదిలావుంటే.. రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో వెనక్కి తగ్గారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలతో ప్రాభవం తగ్గడం, ఇటీవల డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం) అధినేత విజయ్‌కాంత్ కన్నుమూయడంతో తమిళ రాజకీయాల్లో కాస్త శూన్యం ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ క్రమంలో అధికార డీఎంకేను సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ మరింత బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విజయ్ పార్టీని ప్రకటించి, తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది కూడా చదవండి : Karnataka: మైనర్ బాలికపై హాకీ ప్లేయర్ అత్యాచారం.. పెళ్లి పేరుతో ఐదేళ్లుగా వచ్చే ఎన్నికల్లో పోటీ.. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) తమ పార్టీ పోటీ చేయదని చెప్పిన ఆయన, ఆ తర్వాత జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థులు నిలబడతారని అన్నారు. మరో అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ కూడా ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ స్థాపించి తమిళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘తమిళగ వెట్రి కట్చి’ పార్టీ చిహ్నంపై కసరత్తు మొదలైంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా పార్టీ చిహ్నం ఉండేలా సూచించాలని ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ అభిమానసంఘాల నిర్వాహకులతో సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ పేరును రిజిస్టర్ చేసిన సమయంలో 5 చిహ్నాలను ఎన్నికల కమిషన్‌కు అందజేశారని, అందులో మహిళలను ఆకట్టుకొనే విధంగా గుర్తు ఉన్నట్లు సమాచారం. కాగా విజయ్ రాజకీయ ప్రవేశంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. #rajinikanth #tamilnadu #vijay #lal-salaam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి