RAJAMOULI - MAHESH : మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా భామ

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో మహేష్ కు జోడీగా ఇండోనేషియా భామను సెలెక్ట్ చేసారని సమాచారం. స్క్రీన్ టెస్ట్ ఫినిష్ అయింది. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి షూట్ ప్లాన్స్ లో చిత్ర బృందం ఉన్నారని ఇన్సైడ్ వర్గాల సమాచారం.

New Update
RAJAMOULI - MAHESH : మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా భామ

Indonesia : దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్స్ తో భాగస్వామ్యం కానుండటంతో ఈ మూవీపై చాలా హైప్ పెరిగింది. ఇక..ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి షూట్ ప్లాన్స్ లో చిత్ర బృందం ఉన్నారని ఇన్సైడ్ వర్గాల సమాచారం.

కొత్త వార్త తెరపైకి 

రాజమౌళి సినిమాలంటే పని చేసే సాంకేతిక బృందం అందరికీ తెలుసు. కానీ .హీరోయిన్స్(Heroines) విషయం మాత్రం చాలా గోప్యంగా ఉంచుతారు జక్కన్న. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్(RRR) చిత్రాల టైంలో కూడా ఊరించి ఊరించి హీరోయిన్స్ ను రివీల్ చేయడం జరిగింది ఇప్పుడు మహేష్ బాబు కు జోడీ విషయంలో చాలా సెర్చింగ్ చేస్తున్నట్లు సమాచారం. మొన్నటివరకు దీపికా పదుకొనె(Deepika Padukone) ఫైనల్ అన్నారు.  కానీ ఇప్పుడు కొత్త వార్త తెరపైకి వచ్చింది.

మహేష్ కు జోడీగా ఇండోనేషియ‌న్ భామ‌

మహేష్ బాబుతో ఇండోనేషియ‌న్ భామ‌(Indonesia Actress) జతకట్టనుందని తెలుస్తోంది.త‌న పేరు… చెల్సియా ఇస్లాన్(Chelsea Islan). కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో న‌టించిన ఈ భామని రీసెంట్ గా స్క్రీన్ టేస్ట్ సైతం చేశారని ..ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టేనని తెలుస్తోంది. అయితే..ఆమెను హీరోయిన్ గా తీసుకుంటారా లేదా ఇంకేమైనా కీలక పాత్ర కోసం తీసుకున్నారా అనేది తెలియాల్సివుంది.

హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో

ఈ థ్రిల్లర్ అడ్వెంచర్  త్రి కంట్రీస్ లో చాలా కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారని సమాచారం. ఇక..సెట్స్ విషయానికి వస్తే.. సినిమాలో సగానికి పైగా ఓకే సెట్ లో చిత్రీకరించనున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా అడ్వoచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుండటంతో హాలీవుడ్ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా సెట్స్ విషయంలో కసరత్తులు మొదలు పెట్టారట. 1500 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న మహేష్ , రాజమౌళి మూవీ పాన్ వరల్డ్ మూవీ గా రాబోతోంది.మార్చిలో సెట్స్ పైకి వెళ్లేందుకు చిత్ర బృందం సిద్ధం అవుతోంది మరిన్ని విషయాలను తెలియజేసేందుకు అతి త్వరలో మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ALSO READ : KING NAGARJUNA : లాయర్ పాత్రలో అలరించనున్న నాగార్జున. కొత్త సినిమా అప్డేట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

New Update

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) "మాస్ జాతర" మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తు మేరా లవర్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి బీట్, డ్యాన్స్‌ను రీమేక్ చేసి మధ్యలో యాడ్ చేశాడు.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా..

ఈ పాట అప్పట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అవే స్టెప్‌లు, మ్యూజిక్‌ వింటేజ్ రవితేజను గుర్తు చేశాయి. ఈ మాస్ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల మాస్ బీట్స్‌తో అదరిగొడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Advertisment
Advertisment
Advertisment