Railway Unions: ఓపీఎస్ అమలు చేయకుంటే రైలు సేవలు నిలిపివేస్తాం.. రైల్వే సంఘాల హెచ్చరిక కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే.. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి. By B Aravind 29 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పింఛన్ విధానాన్ని తీసుకురావాలని.. పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే.. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరికలు చేశాయి. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలన్న తమ డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని.. అందుకే నిరసన చేయడం తప్ప ఇంకో మార్గం లేదని.. జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (JFROPS) కన్వీనర్ శివ్ గోపాల్ మిశ్రా పేర్కొన్నారు. Also Read: పీఎం కిసాన్ పథకంలో కొత్తగా ఎంతమంది లబ్ధిదారులు చేరారంటే.. వివిధ రైల్వే సంఘాలకు చెందిన కార్మికులు, ఉద్యోగుల ప్రతినిధుల బృందం మార్చి 19న కేంద్ర రైల్వే శాఖను కలిసి సమ్మే అంశంపై అధికారికంగా నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు శివ గోపాల్ తెలిపారు. అంతేకాదు ఇతర ప్రభుత్వ సంఘాలు కూడా తమ పోరాటంలో భాగం కానున్నట్లు పేర్కొన్నారు. కొత్త పింఛను విధానం ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలకు అనుగణంగా లేదని అన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని అమలు చేయడంపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 3 శాతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం.. మిగతా 97 శాతం ప్రజలపై పన్నుల భారం పడుతుందని హెచ్చరిస్తున్నారు. Also read: ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే: సుప్రీంకోర్టు #telugu-news #national-news #trains #nps #ops #old-pension మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి