Rahul Gandhi : జగనన్నపై షర్మిల ఆఖరి అస్త్రం.. రేపు కడపకు రాహుల్ గాంధీ! ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఏపీకి రాబోతున్నారని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. ఆయన ముందుగా కడపజిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన వైఎస్సాఆర్ ఘాట్ ను సందర్శించి వైఎస్ సమాధికి నివాళులు ఆర్పిస్తారు. By Bhavana 10 May 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Ap Elections 2024 : ఏపీలో ఎన్నికలు జరిగేందుకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్ని కూడా తమ ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు రంగంలోకి ముఖ్య నేతలతో పాటు ప్రచారం కోసం సినీ తారలను కూడా రంగంలోకి దించి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఇప్పటికే బీజేపీ కూటమి(BJP Alliance) కోసం నరేంద్ర మోదీ కూడా ప్రచారం నిర్వహించారు. ఈక్రమంలోనే ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్(Congress) నేత, ఏఐసీసీ(AICC) మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఏపీకి రాబోతున్నారని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. ఆయన ముందుగా కడపజిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన వైఎస్సాఆర్ ఘాట్ ను సందర్శించి వైఎస్ సమాధికి నివాళులు ఆర్పిస్తారు. అక్కడ నుంచి కడపకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో రాహుల్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా సభను కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తులసీ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ కు లభించిన ఆదరణ , స్పందన షర్మిలకు లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. అయిదేళ్ల జగన్, చంద్రబాబు పాలన చూసి ప్రజలు విసిగిపోయారని వివరించారు.మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ, రేపు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి లక్ష రూపాయలు, ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటారో వారందరికీ 4వేల రూపాయల పెన్షన్, టీడీపీ, వైసీపీ, జనసేన కు ఓటు వేసినా అది బీజేపీకే ననే భావన ప్రజల్లో ఉందన్నారు. ఏన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య పోటీలో ఇండియా కూటమిదే విజయం అని అన్నారు. బీజేపీ విధానాల పట్ల ప్రజలు విసిగిపోయారని, అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టే ఈ ఎన్నికల్లో షర్మిల మూడు లక్షల మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన వివరించారు. Also read: జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ #congress #rahul-gandhi #kadapa #ap #sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి