Rahul Gandhi: అధికారంలోకి వస్తే తెలంగాణలో కుల గణన సర్వే చేపడతాం: రాహుల్ గాంధీ తెంలగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముందుగా కులగణన సర్వే చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు.. ఓబీసీ జనాభా ఎంత అని నిలదీశానని.. దేశాన్ని 90 మంది అధికారులు పరిపాలిస్తున్నారని చెప్పారు. అయితే అందులో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారని పేర్కొన్నారు. అందుకే దేశానికి ఎక్స్‌రే చేయడం అవసరమని చెబుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తోందని.. కచ్చితంగా ఇక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. By B Aravind 19 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒంటిరి కాదని.. బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా వారితో కలిసే ఉంటాయని విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన బస్సు యాత్రలో ఆయన రాహుల్ ఈ విధంగా మాట్లాడారు. తాను బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని పేర్కొన్నారు. అందుకోసమే కేంద్రం తనపై ఎన్నో కేసులు పెట్టిందని.. చివరికి తన సభ్యత్వం కూడా లాగేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి మద్దతు పలకుతున్నారని తెలిపారు. అందుకే కేసీఆర్‌పై ఇప్పటిదాక సీబీఐ, ఈడీ లాంటి దాడులు జరగడం లేదంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఎంఐఎం పార్టీ సైతం దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో బీజేపీకి సహాయపడుతోందని తెలిపారు. అలాగే దేశంలో కులగణన చేయడం కూడా అవసరం ఉందని రాహుల్ అన్నారు. Also Read: రాహుల్ బస్సు యాత్రకు బ్రేక్… రేపు ఆర్మూర్ సభతో యాత్ర ముగింపు..!! బీజేపీతో పోరాడుతున్నానని నిరంతరం నా డీఎన్‌ఏ గుర్తుకు చేస్తోందని తెలిపారు. అలాగే బీజేపీకి మద్దతు ఇచ్చేవారు నా పై విమర్శలు చేస్తుంటే.. నా పోరాటం మాత్రం సవ్యంగా సాగుతోందని అర్ధం అవుతోందంటూ పేర్కొన్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. అలాగే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తోందని.. కచ్చితంగా ఇక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రజల పాలన ఏర్పడుతుందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు.. ఓబీసీ జనాభా ఎంత అని నిలదీశానని.. దేశాన్ని 90 మంది అధికారులు పరిపాలిస్తున్నారని చెప్పారు. అయితే అందులో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారని పేర్కొన్నారు. అందుకే దేశానికి ఎక్స్‌రే చేయడం అవసరమని చెబుతున్నానని తెలిపారు. సాధారణంగా వైద్యుని దగ్గరకు వెళ్తే.. ఏ రోగమో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీసుకొని రమ్మంటారని.. అందుకే తెలంగాణలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుకు ఎక్స్‌రే (అంటే కులగణన) తీయించే పనిచేస్తామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఇదిలా ఉండగా.. రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ బస్సు యాత్ర కొనసాగించనున్నారు. #telangana-news #congress #rahul-gandhi #telangana-election-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి