మోడీని దాటేసిన రాహుల్.. ఆ విషయంలో తమ నేత టాప్ అంటున్న కాంగ్రెస్!

సోషల్ మీడియాలో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ పోటీ నడుస్తోంది. ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోడీ కన్నా రాహుల్ గాంధీ వీడియోలనే ఎక్కువ మంది చూశారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ, మోడీ ప్రసంగాల వీడియోలకు వచ్చిన వ్యూవ్స్ ను ఎక్స్ ప్లాట్ ఫారమ్(గతంలో ట్విట్టర్) షేర్ చేసింది. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫారమ్స్ లో మోడీ కన్నా రాహుల్ గాంధీకి ఎక్కువ వ్యూవ్స్ వచ్చాయని పేర్కొంది.

New Update
Rahul Gandhi: ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ

సోషల్ మీడియా(social media)లో మోడీ(modi) వర్సెస్ రాహుల్ గాంధీ(Rahul gandhi) పోటీ నడుస్తోంది. సోషల్ మీడియాలో మోడీ టాప్ అని బీజేపీ అంటే... లేదు లేదు రాహుల్ గాంధీ నంబర్ వన్ అని కాంగ్రెస్ చెబుతోంది. మోడీకి వున్న ఫాలోవర్స్(followers) ఆయన క్రేజ్ ఏంటో తెలిసి పోతుందని బీజేపీ అంటుంటే... వ్యూవ్స్(views) విషయంలో మోడీని రాహుల్ దాటేశారని కాంగ్రెస్ చెబుతోంది. తాజాగా ఈ మేరకు డేటాను విడుదల చేసింది.

ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోడీ కన్నా రాహుల్ గాంధీ వీడియోలనే ఎక్కువ మంది చూశారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ, మోడీ ప్రసంగాల వీడియోలకు వచ్చిన వ్యూవ్స్ ను ఎక్స్ ప్లాట్ ఫారమ్(గతంలో ట్విట్టర్) షేర్ చేసింది. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫారమ్స్ లో మోడీ కన్నా రాహుల్ గాంధీకి ఎక్కువ వ్యూవ్స్ వచ్చాయని పేర్కొంది.

సంసద్ టీవీలో రాహుల్ గాంధీ ప్రసంగానికి 3.5 లక్షల వ్యూవ్స్ రాగా, మోడీ వీడియోకు కేవలం 2.3 లక్షల వ్యూవ్స్ మాత్రమే వచ్చాయని కాంగ్రెస్ వెల్లడించింది. ఇక యూట్యూబ్ లో రాహుల్ గాంధీ స్పీచ్ కు 26 లక్షల వ్యూవ్స్ రాగా, మోడీ స్పీచ్ కు కేవలం 6.5 లక్షల వ్యూవ్స్ వచ్చాయని తెలిపింది. ఇక ఎక్స్ ప్లాట్ ఫారమ్‌లో 23,000, ఫేస్‌బుక్ లో 73 లక్షల వ్యూవ్స్ వచ్చాయని వివరించింది.

మోడీకి మాత్రం ఎక్స్ ప్లాట్ ఫారమ్ లో 22,000, ఫేస్ బుక్ లో 11 వేల వ్యూస్ వచ్చాయని చెప్పింది. అయితే డేటా ఏ సమయం వరకు తీసుకున్నారనే విషయాన్ని మాత్రం కాంగ్రెస్ వెల్లడించలేదు. ఇక ఫాలోవర్స్ పరంగా చూస్తే రాహుల్ గాంధీకి అందనంత ఎత్తులో ప్రధాని మోడీ వున్నారు. ప్రధాని మోడీకి 90.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ వుండగా రాహుల్ గాంధీకి కేవలం 24 మిలియన్ల మంది ఫాలోవర్స్ మాత్రమే వున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు