Rahul Gandhi: రానున్న ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే విజయం-రాహుల్ గాంధీ దేశంలో మరో మూడు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధం అుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పార్టీశ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అందరూ ఐక్యంగా కలిసి పోరాడలని పిలుపునిచ్చారు. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని ఆయన వ్యాఖ్యానించారు. By Manogna alamuru 29 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rahul Gandhi: త్వరలో జరగబోయే మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ ఎన్నికల్లో విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పని చేయాలని సూచించారని చెప్పాయి. త్వరలో మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, మిత్ర పక్షాలతో కలిసి ఎన్నికల్లో పని చేయాలని రాహుల్‌గాంధీ, హస్తం పార్టీ నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇటీవల సమీక్షించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హస్తం పార్టీలో సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు విషయమై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. Also Read:Hemanth Soren: ఇక ప్రజా సేవలోనే-హేమంత్ సోరెన్ #congress #rahul-gandhi #elections #party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి