Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదాని గ్రూప్‌పై దర్యాప్తు చేస్తాం.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

రాహుల్‌గాంధీ మరోసారి అదాన్ గ్రూప్ సంస్థలపై సంచలన ఆరోపణలు చేశారు. బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూపు అధిక ఇన్‌వాయిస్‌లోతో ప్రజలు విద్యుత్తుకు ఎక్కువ బిల్లులు చెల్లించేలా చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతోందని మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని ఆయన ఉటంకించారు.

New Update
Rahul Gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ శాలరీ.. ఆయనకు ఉండే పవర్స్ ఏంటో తెలుసా?

ఇటీవల అదాని గ్రూప్ సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ బయటపెట్టిన విషయాలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మోసపూరిత లావాదేవీలు, స్టాక్‌ మార్కెట్లో తారుమారు చేయడం లాంటి అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. పార్లమెంటు సమావేశాల్లో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అదాని వ్యవహారాన్ని లేవనెత్తి మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రాహుల్ మరోసారి అదాన్ గ్రూప్ సంస్థలపై సంచలన ఆరోపణలు చేశారు. బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూపు అధిక ఇన్‌వాయిస్‌లోతో ప్రజలు విద్యుత్తుకు ఎక్కువ బిల్లులు చెల్లించేలా చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతోందని మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని ఆయన ఉటంకించారు. అయితే ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు దర్యాప్తు చేసేందుకు ఆదేశించడం లేదంటూ ప్రశ్నించారు.

ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్‌పై కచ్చితంగా దర్యాప్తునకు ఆదేశిస్తామని పేర్కొన్నారు. ఇండోనేషియా నుంచి అదానీ గ్రూప్ బొగ్గును దిగుమతి చేసుకుంటోందని.. అది ఇండియాకు చేరే సమయానికి దాని ధర రెట్టింపు అవుతోందని రాహుల్ అన్నారు. ఇలా అధికంగా ధరలు పెరగడంతో.. సామన్య ప్రజలు కూడా భారీగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు పేదలకు కరెంటు బిల్లులపై సబ్సిడీలు చెల్లించాల్సి వస్తోందని మండిపడ్డారు. ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రాహుల్‌.. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా దర్యాప్తునకు ఆదేశిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని.. దర్యాప్తు జరిపి వారి విశ్వసనీయతను నిరూపించుకోవాలని సవాలు చేశారు. మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ ధరలకు అదానీ గ్రూప్‌ బొగ్గు దిగుమతి చేసుకున్నట్లు కనిపిస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్‌లో వచ్చిన కథనంపై రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తూ ఈ ఆరోపణలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు