AP Politics : వార్ వన్ సైడ్.. ఏపీలో 2009 రిపీట్ అవుతుందా! RTVతో రఘువీరా రెడ్డి సెన్సేషనల్ ఇంటర్వ్యూ

ఏపీ రాజకీయ పరిస్థితులపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వార్ వన్ సైడ్ లేదని, రాష్ట్రంలో 2009 రిపీట్ అవుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మ్యాజిక్ ఫిగర్ 88గా పేర్కొన్నారు. పూర్తి ఇంటర్య్వూ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
AP Politics : వార్ వన్ సైడ్.. ఏపీలో 2009 రిపీట్ అవుతుందా! RTVతో రఘువీరా రెడ్డి సెన్సేషనల్ ఇంటర్వ్యూ

Raghuveera Reddy : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల (Assembly - Lok Sabha Elections) నేపథ్యంలో ఏపీ రాజకీయ (AP Politics) పరిస్థితులపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో 2009 రిపీట్ అవుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వార్ వన్ సైడ్ లేదని, మ్యాజిక్ ఫిగర్ 88గా పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత సున్న సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ (Congress) ఈసారి ఖాతా తెరవబోతుందన్నారు. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై కోపం తగ్గిందని చెప్పారు. ఇక ఈ ఎన్నిక మొత్తం డబ్బుతో ముడిపడి ఉందని ఒక ఓటుకు వెయి నుంచి 5 వేలు పంచినట్లు వెల్లడించారు. ఒకాయన రూ.8వేల కోట్లు ఖర్చుచేస్తే మరొకాయన రూ. 6 వేల కోట్లు ఖర్చు పెట్టారని మొత్తంగా రూ.14వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని చెప్పారు. ఇక ఎవరు గెలుస్తారనే విషయంలోనూ రూ. 20 వేల కోట్లు బెట్టింగ్ నడుస్తోందని సమాచారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈసారి వన్ సైడ్ మెజార్టీ ఉండదని, ఎవరికి వారే 150 పైగా వస్తున్నాయని చెప్పుకుంటున్నప్పటికీ 2009 రిపీట్ అవుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మ్యాజిక్ ఫిగర్ 88 మాత్రమే. వన్ సైడ్ వార్ లేదు. డబ్బులు కుమ్మరించారు కాబట్టి చెప్పడం కష్టంగా ఉంది. ప్రజలు ఎవరికీ ఓటు వేశారో బయటకు చెప్పలేకపోతున్నారంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియో చూడండి.

Also Read : మరో మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త

Advertisment
Advertisment
తాజా కథనాలు