Narayanamurthy : నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన పీపుల్ స్టార్

ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. పీపుల్ స్టార్ గా ప్రజల మన్ననలు పొందుతున్న ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. 40 ఏళ్ల సినీ ప్రయాణంలో కమర్షియల్ కాకుండా ప్రజా సమస్యలపైనే సినిమాలు తీస్తున్నారు.

New Update
Narayanamurthy : నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన పీపుల్ స్టార్

Narayanamurthy : ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి నేడు 70వ పడిలోకి అడుగుపెట్టారు. ఎర్ర జెండా పాట వినబడగానే అందరి కళ్లముందు కదలాడే ఆయన.. పీపుల్ స్టార్ గా భారీ పాపులారిటీ పొందారు. విలక్షణమైన నటనతోనే కాదు తన ఆదర్శవంతమైన ఆలోచనలతో సమాజాన్ని ఎప్పటికప్పుడూ తట్టిలేపుతున్నాడు. కమ్యూనిస్టు భావాజాలంతో సినిమాలను తెరకెక్కిస్తున్నప్పటికీ ఆయన కమ్యూనిస్టును కాదంటాడు. ఆయనొక హేతువాది, అవివాహితుడు.

ఈయన తూర్పుగోదావరి జిల్లాలోని మల్లంపేటలో 1954 డిసెంబర్ 31న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నారాయణమూర్తి.. చిన్నప్పటి నుంచి సినిమాల మీద మక్కువతో మద్రాసుకు వెళ్లారు. అలా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘నీడ’ సినిమాలో మొదటిసారి కనిపించిన ఆయన.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు గడుస్తోంది. అయితే ఇన్నేళ్ల కాలంలో అతను ఏ రోజు కమర్షియల్ వైపు అడుగులు పడనియ్యలేదు. అతని సినిమా కథలన్ని సామాన్య ప్రజలకు దగ్గరగా ఉంటున్నాయి. మనసులో ఉన్న భావాలతోపాటు సమాజంలో నెలకొన్ని అనేక సందర్భాలను, ముఖ్యంగా విద్యా, వైద్యం, అన్యాయం, రాజ్యహింసకు సంబంధించిన కాన్సెప్టులే వెండితెరమీద ఆవిష్కరిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Telangana Crime: కోడిగుడ్ల షాపు దగ్గర దారుణం.. ‘అరేయ్’ అన్నాడని యువకున్ని కొట్టి చంపిన ఫ్రెండ్స్

ఇక ఆయన తెరకెక్కించిన అర్థరాత్రి స్వాతంత్య్రం, ఎర్రసైన్యం, ఒరేయ్ రిక్షా, చీమలదండు, దళం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. అలాగే నారాయణ మూర్తి హీరోగా పెట్టి దర్శక రత్న దాసరి 'ఒరేయ్ రిక్షా' తీశారు. హీరోయిన్ రవళి నారాయణరావుకి జోడీగా నటించింది. చెల్లెలి సెంటిమెంట్ ప్రధానాంశంగా తీసుకుని చిత్రాన్ని రూపొందించారు దాసరి. అన్నగా ఆర్ నారాయణమూర్తి అద్భుతంగా నటించగా దాసరి కూడా చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు.

ఇది కూడా చదవండి : Weddings 2023 : మూడుముళ్లతో ఒక్కటైన సినీ తారలు.. మైమరపిస్తున్న పెళ్లి ఫొటోలు

ఇక నారాయణమూర్తి ఏ ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడతాడు. అవివాహితుడైన నారాయణమూర్తిని ఎందుకు పెళ్ళిచేసుకోలేదని ప్రశ్నిస్తే, అదంత చర్చించదగ్గ అంతర్జాతీయ సమస్యేమీకాదని దాటవేస్తాడు. తన జీవిత భాగస్వామి తన ప్రజాజీవితానికి ఎక్కడ అడ్డువస్తుందో అనే అనుమానంతో పెళ్ళి చేసుకోలేదంటాడు. సినీ దర్శకనిర్మాతగా 19 సినిమాలను తీసి, 25 సినిమాలలో నటించి ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ, ఈయనకు సొంత ఇళ్లు కానీ, సొంత కారు కానీ లేవు. ఈయనకు తెలుగుదేశం పార్టీ రెండుసార్లు కాకినాడ లోక్‌సభ స్థానం, కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇవ్వజూపినా, రాజకీయాలలో ప్రవేశించే ఉద్దేశం లేకపోవటం వలన తిరస్కరించాడు. చివరగా అంటరానితనం దుర్మార్గంవంటివి ఇష్టం ఉండొద్దని, బర్త్ డే లు, మదర్స్ డే లు, ఫాదర్స్ డేలు జరుపుకోడు. పునర్జన్మ, స్వర్గం, నరకం, ఖర్మ సిద్ధాంతం మీద నమ్మకం లేదంటారు. ఏడిస్తేనే నీ కష్టాలు తొలుగుతాయనుకుంటే ఏడువు అన్న బుద్ధుడి సూక్తి నచ్చి ఏడుపు మానానంటారు నారాయణమూర్తి.

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే టైటిల్ తో నారాయణమూర్తి త్వరలో విశాఖ స్టీల్, దాని చుట్టూ ఉన్న పరిస్థితులు, ఉద్యమాల కథాంశంతో సినిమా తెరకెక్కిస్తున్నారు.

#70th #r-narayanamurthy #special #birthday
Advertisment
Advertisment
తాజా కథనాలు