IPL-2024 : అశ్విన్ ఇలా బాదేశాడేంటీ..పిచ్చ కొట్టుడు కొట్టాడుగా..

ఇదేందెయ్యా ఇది...నేనెప్పుడూ సూసుండ్లే అంటున్నారు నిన్న రాజస్థాన్ రాయల్స్‌లో ఆటగాడు ఆర్.అశ్విన్ బ్యాటింగ్ చూసి. 19 బంతుల్లో 3 సిక్సులు బాది..29 పరుగులు చేశాడు.

New Update
IPL-2024 : అశ్విన్ ఇలా బాదేశాడేంటీ..పిచ్చ కొట్టుడు కొట్టాడుగా..

DC v/s RR : ఆర్. అశ్విన్(R Ashwin).. ఇతని గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు. భారత బౌలింగ్ పిల్లర్లలో ఒకడైన ఆశ్విన్ నిజానికి ఆల్ రౌండర్ అనే చెప్పుకోవాలి. మొదటి నుంచీ ఇతని బ్యాంటింగ్ ట్రాక్ బానే నడుపుకుంటూ వస్తున్నాడు. అయితే ఇతని సత్తా అంతా ఇప్పటివరకూ టెస్ట్‌ మ్యాచ్‌(Test Match) లలోనే చూపించాడు. మిగతా ఫార్మాట్లలో పెద్దగా ఏమీ లేదు. అదీకాక టీ20ల్లాంటి ఫాస్ట్ ఫార్మాట్‌లో ఇతను ఎప్పుడూ పెద్దగా బ్యాటింగ్ చేసింది లేదు. కానీ నిన్నటితో అది కూడా అధిగమించేశాడు అశ్విన్. తన ఆర్డర్ కన్నా ముందు వచ్చి మరీ చితక్కొట్టేశాడు.

మూడు సిక్స్‌లతో చెలరేగిపోయాడు..

నిన్న ఐపీఎల్‌(IPL) లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) తో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ అశ్విన్ 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. దీనిలో 18 పరుగులు సికసుల ద్వా వచ్చినవే. బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన అశ్విన్ ఎదుర్కొన్న బౌలర్లు కూడా అల్లటప్పాగాళ్ళు కాదు. ముందు స్టార్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ బౌలింగ్‌లో ఒక సిక్స్ కొట్టిన అశ్విన్ తరువాత సూపర్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో రెండు సిక్సులు కొట్టి దిమ్మ తిరిగిపోయేలా చేశాడు. ఆ సిక్స్‌లు కూడా మామూలుగా లేవు. మ్యాచ్ చూసినవాళ్ళతో అరిపించేలా ఉన్నాయి. దీంతో నిన్నటి ఫెర్ఫామెన్స్‌కు అశ్విన్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ కొత్త కోణానికి మురిసి ముక్కలవుతున్నారు.

మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్..

నిన్నటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సమిష్టి కృషితో ఢిల్లీ డేర్ డెలవిల్స్ మీద 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్స్‌లో రియాన్ పరాగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ మొదటి బ్యాటింగ్ చేసి 185 పరుగులు లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. అయితే లక్ష్య ఛేదనలో ఢి్లలీ తడబడిపోయింది. దీంతో 173 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి పాలయింది.

Also Read : Chai Pe Charcha: కృత్రిమ మేధ మీద చాయ్ పే చర్చా..బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు.

New Update
RTC MD VC Sajjanar

RTC MD VC Sajjanar

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు. వీటి భర్తీ తర్వాత కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్  జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

Also Read: తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ..పేలుతున్న మాటల తూటాలు!

అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత ఆయన మాట్లాడారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని కూడా చెప్పారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ప్రకారం మరో 18వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.     

Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

గ్రూప్​1,2,3,4 పోస్టులతోపాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో14,236 అంగన్ వాడీ, హెల్త్​ డిపార్ట్​మెంట్​లో 4 వేలకు పైగా పోస్టులకు ఏప్రిల్ చివరిలోగా నోటిఫికేషన్ రిలీజ్​ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరిన్ని శాఖల ఖాళీలపై స్పష్టత రాగానే  జాబ్​క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ విడుదలకానున్నాయి. ఇక ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  నోటిఫికేషన్‌ను షెడ్యూల్​ చేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ కోసం వాయిదా వేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావాల్సివుంది. 

Also Read: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

 rtv-news | rtc | jobs

 

Advertisment
Advertisment
Advertisment