Kim - Putin : కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గిఫ్ట్‌.. ఏంటంటే

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బహుమతి ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. కిమ్‌ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్‌ దాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.

New Update
Kim - Putin : కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గిఫ్ట్‌.. ఏంటంటే

Putin Gift To Kim : రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Vladimir Putin).. ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌(Kim Jong Un) ఉన్‌కు ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బహుమతి ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఫిబ్రవరి 18వ తేదీన.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్‌, వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా ప్రతినిధి పాక్‌ జోంగ్‌ ఛోన్ దాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో.. కిమ్‌ యో జోంగ్‌ రష్యాకు కృతజ్ఞతలు చెప్పారు.

Also Read : నావల్నీ మృతిపై కీలక అప్‌డేట్‌.. ఆయన తల, ఛాతిపై కమిలిన గాయాలు..!

రష్యాకు సహకరిస్తున్న ఉ.కొరియా

మరోవైపు.. రష్యా, ఉత్తరకొరియా దేశాలపై అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో వ్లాదిమీర్‌ పుతిన్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాస్కోలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో.. ఉత్తర కొరియా రష్యాకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. క్షిపణలు, రాకెట్లతో పాటు పలు ఆయుధాలను కూడా సరఫరా చేస్తు్న్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉత్తర కొరియా వీటిని ఖండిస్తోంది.

అన్నీ అక్రమ వాహనాలే..!

కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు వాహనాలంటే వ్యక్తిగతంగా ఇష్టం అని కొందరు చెబుతుంటారు. ఆయన దగ్గర చాలావరకు లగ్జరీ కార్లు(Luxury Cars) ఉన్నట్లు సమాచారం. అంతేకాదు అవన్నీ కూడా అక్రమంగా రవాణా చేసినవనే ప్రచారం ఉంది. గత ఏడాది కిమ్‌.. రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు పుతిన్‌ కారు ఆరస్‌ సెనేట్‌ లిమోసిన్‌ను ఆసక్తిగా పరిశీలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కిమ్‌ను కారులో ఎక్కించుకొని పుతిన్ డ్రైవ్‌ చేసినట్లు వార్తలు కథనాలు వచ్చాయి. ఇప్పడు కిమ్ వద్ద మెర్సిడెస్,మేబ్యాక్, రోల్స్ రాయిస్‌ లాంటి పలు లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిని ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడంపై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించింది. ఇప్పుడు పుతిన్ కారు గిఫ్ట్‌గా ఇవ్వడం వల్ల ఇది నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read : చైనా-పాకిస్తాన్ ల పై టాటా గూఢచారి..మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి అంతరిక్షానికి.. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది.దీని పై భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ...ఏప్రిల్‌ 8 లోగా డ్రాగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.

New Update
Trump

Trump

అమెరికా ,చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.దీని పై భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ...ఏప్రిల్‌ 8 లోగా డ్రాగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

లేదంటే ఏప్రిల్‌ 9 నుంచి 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశంతో చర్చలు కూడా నిలిపివేస్తామని తేల్చి  చెప్పారు.అమెరికా పై చైనా 34 శాతం అదనపు సుంకాలను ప్రకటించింది.ఆ దేశం ఇప్పటికే పెద్ద ఎత్తున టారిఫ్‌ లు విధిస్తోంది.కంపెనీలకు అక్రమ రాయితీలు,దీర్ఘకాలికంగా కరెన్సీ అవకతవకలకు పాల్పడుతోంది.

Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

నేను హెచ్చరించినప్పటికీ..అదనపు సుంకాల ద్వారా అమెరికా పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశమైనా యత్నిస్తే వెంటనే మరిన్ని టారిఫ్‌ లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముందు ప్రకటించిన దానికంటే పెద్ద ఎత్తున్న విధిస్తాం. అందువల్ల ..ఏప్రిల్‌ 8 నాటికి చైనా తన 34 శాతం అదనపు సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.

లేకపోతే..ఏప్రిల 9 నుంచే ఆ దేశం పై 50 శాతం అదనపు టారిఫ్‌ లు విధిస్తాం.  ఆ దేశంతో అన్ని చర్చలూ రద్దు చేస్తాం అని సామాజిక మాధ్యమాల వేదికగా ట్రంప్‌ హెచ్చరించారు.అంతకు ముందు ట్రంప్‌ చైనాపై 34 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించారు. దీనికి డ్రాగన్‌ సైతం దీటుగా స్పందించింది.

రెండువిధాలా వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువులను అమెరికాకు చెందిన 16 సంస్థలకు ఎగుమతి చేయడం పై నిషేధం విధించాలని నిర్ణయించింది. అమెరికాలోని రక్షణ, కంప్యూటర్‌,స్మార్ట్‌ ఫోన్ల పరిశ్రమలను దెబ్బతీసే రీతిలో కొన్ని రకాల అరుదైన ఖనిజాల ఎగుమతుల పై నియంత్రణలు ప్రకటించింది. దీంతో పాటు ప్రతీకార సుంకాల పై ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యాజ్యం దాఖలు చేసింది.

ఈ  విషయంలో ఇప్పటికే బీజింగ్‌ తీరుఉ,తప్పుపట్టిన ట్రంప్‌..తాజాగా ప్రతీకార సుంకాలను మరింత పెంచతానంటూ స్పష్టం చేశారు.

Also Read: Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్‌లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

china | america | tarriffs | beijing | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment