Suicide : సూర్యాపేట ఎల్కారంలో టెన్షన్..టెన్షన్‌!

సూర్యాపేట జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన మాజీ మావోయిస్టు ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి.

New Update
Suicide : సూర్యాపేట ఎల్కారంలో టెన్షన్..టెన్షన్‌!

Yellaiah Suicide : సూర్యాపేట(Suryapet) జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన మాజీ మావోయిస్టు(Maoist) ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఆందోళన కారులు ప్రత్యర్థుల ఇళ్లలో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నిరసనకారుల ఆందోళన దృష్ట్యా గ్రామంలో వారం రోజులుగా పోలిస్ పికెట్ నిర్వహిస్తున్నారు. దాడుల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అసలేం జరిగిందంటే..

సూర్యాపేట మండల కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మర్డర్(Murder) మిస్టరీలో సంచలన అంశాలు వెలుగుచూశాయి. పక్కా ప్లాన్ ప్రకారం ఆయనను కిడ్నాప్ చేసి దారుణ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఓ స్వచ్ఛసంస్థ నిర్వాహకుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎల్లయ్యను చంపేందుకు ఓ మహిళతో పాటు, శ్రీనివాస్‌ అనే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఏపీ(Andhra Pradesh) లో ఓ పంచాయితీకి పరిష్కారం చెప్పాలని ఈనెల 18న ఎల్లయ్యను నిందితుడు శ్రీనివాస్ తీసుకెళ్లాడు. జగ్గయ్యపేట దగ్గర్లోని లాడ్జీలో ఎల్లయ్యను హత్య చేశారని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Nalgonda Politics : నల్లగొండ కాంగ్రెస్ లో కొత్త లొల్లి.. ఆ చేరికలు చెల్లవన్న పీసీసీ!

అనంతరం ఎల్లయ్య డెడ్ బాడీని ఫిషరీస్‌ లారీలో తీసుకెళ్లి విశాఖపట్నం దగ్గర సముద్రంలో పడేసినట్లు గుర్తించినట్లు సమాచారం. పాత కక్షలే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎల్లయ్యకు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడితో భూ వివాదం ఉందని సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు