Profits on Shares : ఆ కంపెనీల షేర్ 100 రూపాయల కంటే తక్కువ.. అదరగొట్టే రిటర్న్స్ 

వంద రూపాయల కన్నా ఆ షేర్ల ధర తక్కువ. కానీ ఈ సంవత్సరం పెట్టుబడిపై నూరుశాతం రాబడిని ఇచ్చాయి ఆ షేర్లు. NHPC లిమిటెడ్, PNB, ఐనెక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీస్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, IRFC షేర్లు ఈ విధంగా మంచి రాబడి ఇచ్చాయి. 

New Update
Profits on Shares : ఆ కంపెనీల షేర్ 100 రూపాయల కంటే తక్కువ.. అదరగొట్టే రిటర్న్స్ 

Profits on Shares : 2023లో భారత స్టాక్ మార్కెట్ ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ ఏడాది తొలిసారిగా 70,000 పాయింట్ల మార్కును దాటింది. హిందీ బెల్ట్‌లోని 3 ముఖ్యమైన రాష్ట్రాల్లో బీజేపీ(BJP) విజయం సాధించిన తర్వాత మార్కెట్ మరింత ఉత్సాహంగా ఉంది.  అయితే 2023లో భారీ రాబడిని అందించిన ఈ 5 స్టాక్‌ల ధర ఇప్పటికీ రూ. 100 కంటే తక్కువ ఉందంటే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. ఆలాగే ఏ ఐదు స్టాక్స్ ఈ సంవత్సరం అద్భుతమైన రాబడి అందిచాయని చెబితే మీరు షాక్ అవుతారు. అవును, ఈ 5 షేర్లు పవర్ సెక్టార్ నుంచి  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్-బ్యాంకింగ్ - ఎనర్జీ సెక్టార్ వరకు ఉంటాయి. మంగళవారం వాటి ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, జనవరి 2023 ప్రారంభం నుంచి, అంటే దాదాపు ఒక సంవత్సరంలో వాటి రాబడి అద్భుతంగా ఉంది.

Also Read: మద్యం వ్యాపారంలోకి కోకాకోలా.. ఈ బ్రాండ్ ఎక్కడ దొరుకుతుందంటే.. 

ఈ ఏడాది షేర్ మార్కెట్‌లో రూ.100 కంటే తక్కువ ధర ఉన్న ఈ 5 షేర్లు ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్(Profits on Shares) ఇచ్చాయి.

  • NHPC లిమిటెడ్ : ఈ ప్రభుత్వ రంగ సంస్థ షేర్ ధర మంగళవారం రూ.62.30గా ఉంది.  ఏడాది ప్రారంభంలో ఇది రూ.40 మాత్రమే. ఈ విధంగా ఈ షేర్ 55.82 శాతం రాబడిని (Profits on Shares)ఇచ్చింది. అంటే, ఇందులో 40వేలతో సంవత్సరం మొదట్లో షేర్లు తీసుకుని ఉంటె ఇప్పుడు అవి 62 వేలరూపాయలకు పైగా చేరుకునేవి. ఒక్కసంవత్సరంలో సగానికి పైగా లాభం వచ్చేది. 
  • PNB : దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు PNB (పంజాబ్ నేషనల్ బ్యాంక్) కూడా ఈ సంవత్సరం తన పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించింది. మంగళవారం బ్యాంకు షేర్లు రూ.89.25 వద్ద కొనసాగుతున్నాయి. ఇది ఒక సంవత్సరంలో 56.08% రాబడిని ఇచ్చింది. జనవరిలో ఈ షేర్ విలువ రూ.57.15 మాత్రమే.
  • ఐనెక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీస్ : ఈ కంపెనీ షేర్లు మంగళవారం రూ.98.35 వద్ద ట్రేడవుతున్నాయి. సంవత్సరం ప్రారంభంలో దీని విలువ రూ. 47, అంటే 111.83% రాబడిని (Profits on Shares)ఇచ్చింది. ఈ కంపెనీ షేర్లు సంవత్సరం మొదట్లో 47 వేల రూపాయలు పెట్టి కొని ఉంటే ఇప్పుడు అది 98 వేలరూపాయలు అయ్యేది.. అంటే 52వేల రూపాయల రాబడి వచ్చేది. 
  • ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఫైనాన్స్ రంగంలో మరో స్టాక్ ఏడాదిలో 100% రాబడిని ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో దీని ధర రూ.29 ఉండగా ఇప్పుడు రూ.59.95గా ఉంది.
  • IRFC : ఈ రైల్వే రంగ కంపెనీ షేర్ సంవత్సరం ప్రారంభంలో రూ.32.90. మంగళవారం రూ.83.75 వద్ద ట్రేడవుతోంది. ఈ విధంగా దాని రాబడి 154.71%. ఇందులో సంవత్సరం మొదట్లో మీరు 33 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటె.. ఇప్పుడు అది 84 వేల రూపాయలు అయ్యేది. అంటే దాదాపు 51 వేల రూపాయల రాబడి వచ్చేది. 

గమనిక : ఈ ఆర్టికల్ ప్రాథమిక అవగాహన కోసం ఇచ్చింది. ఇందులో ఏ రకమైన షేర్లు కొనమని కానీ, అమ్ముకోమని కానీ, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టమని కానీ రికమండ్ చేయడం లేదు. ఏదైనా షేర్లలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మీ ఆర్ధిక సలహాదారుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. 

Watch this interesting Video :

Advertisment
Advertisment
తాజా కథనాలు