హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాట ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
Also Read: Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే
ఏప్రిల్ 7వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది. ఈ జిల్లాల వాసులు వర్షం కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరింంచింది.
Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
ఏప్రిల్ 8వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదివారం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ పేర్కొంది. ఇటీవల తెలంగాణలోని చాలా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భూమి వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.క్యుములో నింబస్ మేఘాల వల్ల వడగండ్ల వానలు కూడా పడవచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:Horoscope: నేడు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు!
Also Read:Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!
telangana | weather | telangana-weather | telangana weather news | telangana weather report today | telangana weather updates | telangana-weather-report | telangana-weather-update | imd alert heavy rains to telangana | weather updates | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates